News July 16, 2024

కరీంనగర్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు!

image

KNR వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలు కానున్నాయి. ఇందుకు ఒకే చోట నాలుగేళ్లు పూర్తైన వారు DPO ఆఫీస్‌లో దరఖాస్తులు అందజేశారు. ఈనెల 11 సా. వరకు ఆప్షన్ల గడువు ముగిసింది. జిల్లాలో 318 మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తుండగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న కార్యదర్శుల 185 మంది ఉన్నారు. ఈనెల 20 వరకు 88 మందికి బదిలీలకు అవకాశం ఉంది. పైరవీలకు తావు లేకుండా స్థానచలనం కల్పిస్తామని అధికారులు తెలిపారు.

Similar News

News December 3, 2025

గన్నేరువరం: ‘క్రీడల్లోనూ బాలికలు ముందుండాలి’

image

బాలికలు చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండి, అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. స్నేహిత అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిమ్మాపూర్ కేజీబీవీ, గన్నేరువరం పాఠశాలలను ఆమె సందర్శించారు. అన్ని రంగాల్లోనూ ప్రతిభ చూపాలని బాలికలకు సూచించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే హెల్ప్‌లైన్ నెంబర్లకు కాల్ చేయాలని కోరారు.

News December 3, 2025

KNR: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ

image

డిసెంబర్ 14న జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నేపథ్యంలో తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం, చిగురుమామిడి, గన్నేరువరం మండలాలలో పోలింగ్ కేంద్రాన్ని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం సందర్శించారు. ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

News December 3, 2025

KNR: ‘ఎన్నికల పనుల్లో అప్రమత్తంగా ఉండాలి’

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, పోలింగ్ వరకు తీసుకోవాల్సిన చర్యలపై ఆమె సమీక్షించారు. ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకూ తావివ్వకూడదని ఆమె ఆదేశించారు.