News February 28, 2025
కరీంనగర్: జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత

వేసవి నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గురువారం జిల్లాలో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 34.0℃ గా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు చలి తీవ్రత కూడా తగ్గడంతో 19.0℃ సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఇప్పటికే జిల్లా ప్రజలు ఉక్కుపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. ఉదయం, రాత్రి సమయాల్లో చలి పెడుతోంది.
Similar News
News October 28, 2025
కరీంనగర్లో పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య

కరీంనగర్ ప్రతిమ వైద్య కళాశాలలో పీజీ ద్వితీయ సంవత్సరం అనస్తీషియా విభాగంలో చదువుతున్న శ్రీనివాస్ అనే వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మత్తు ఇంజక్షన్ తీసుకుని తన గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషాదం సంఘటనతో కళాశాల పరిసరాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 28, 2025
KNR: సీసీఎస్ PS నూతన కార్యాలయం ప్రారంభం

సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని సీపీ గౌష్ ఆలం ప్రారంభించారు. గతంలో కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనంపైన పనిచేసిన సీసీఎస్ పోలీస్ స్టేషన్ను కరీంనగర్ రూరల్ ఏసీపీ కార్యాలయ కాంపౌండ్లో నిర్మించిన నూతన భవనంలోకి తరలించారు. నూతన భవనం ద్వారా సీసీఎస్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి మెరుగైన వాతావరణం లభిస్తుందని, వారు మరింత సమర్థవంతంగా సేవలు అందించగలరని సీపీ ఆశాభావం వ్యక్తం చేశారు.
News October 28, 2025
కురిక్యాల ఘటనపై MLA సత్యం సీరియస్

గంగాధర మండల కురిక్యాల ZPHSలోఅటెండర్ యాకుబ్ పాషా విద్యార్థినుల పట్ల ప్రవర్తించి తీరుపై MLA మేడిపల్లి సత్యం సీరియస్ అయ్యారు. పాఠశాలలో జరిగిన సంఘటనపై ఆరా తీసి, అధికారులు, స్కూల్ ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికాలంగా పాఠశాలలో విద్యార్థినులపై వేధింపులు జరుగుతున్నా చోద్యం చూస్తున్నారా అని మండిపడ్డారు. అనంతరం కలెక్టర్, సీపీతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


