News April 13, 2025
కరీంనగర్ జిల్లాలో యాక్సిడెంట్

శంకరపట్నంలో శనివారం సాయంత్రం ఓ లారీ RTC బస్సును ఢీకొనడంతో అది వెళ్లి కారును ఢీకొంది. తాడికల్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై KNR నుంచి WGL వైపు వెళ్తున్న మెట్పల్లి డిపో RTC బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేస్తుండగా లారీ ఢీకొట్టింది. అదే సమయంలో HZBD నుంచి KNR వైపు ఎదురుగా వస్తున్న ఓ కారును ఈ బస్సు ఢీకొంది. బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరూ సురక్షితంగా బయటపడ్డారు.
Similar News
News November 16, 2025
త్వరలో HYDలో ఎనిమీ ప్రాపర్టీ ప్రాంతీయ కార్యాలయం

రాష్ట్రంలో ఎనిమీ ప్రాపర్టీలు పరిరక్షణ కోసం HYDలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ముంబై ప్రాంతీయ కార్యాలయం తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల వ్యవహారాలు చూస్తోంది. హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల్లో ఎనిమీ ప్రాపర్టీలపై రెవెన్యూశాఖ సర్వే నిర్వహించింది. మియాపూర్ పరిధిలో వందల ఎకరాలు ఉండగా, కొంతభాగం అక్రమ ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు.
News November 16, 2025
గవర్నర్ పర్యటనకు పటిష్ఠ భద్రత కల్పించాలి: SP

ఇవాళ బాపట్ల జిల్లాకు వస్తున్న గవర్నర్కు పటిష్ఠ భద్రత కల్పించాలని ఎస్పీ ఉమామహేశ్వర్ సిబ్బందికి సూచించారు. సూర్యలంక వద్ద గవర్నర్ పర్యటించనున్న ప్రాంతాలను ఆయన శనివారం పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి వివరించారు. కాన్వాయ్ వచ్చే సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని, తిరిగి వెళ్లే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
News November 16, 2025
మెదక్: దరఖాస్తుల ఆహ్వానం

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3 పురస్కరించుకొని రాష్ట్రస్థాయిలో అందించే పురస్కారాలకు అర్హులైన వ్యక్తులు, సంస్థల నిర్వాహకుల నుంచి ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తెలిపారు. దరఖాస్తులను ఈనెల 17 వరకు https://wdsc.telangana.gov.in సమర్పించాలని సూచించారు.


