News April 13, 2025
కరీంనగర్ జిల్లాలో యాక్సిడెంట్

శంకరపట్నం మండలంలో శనివారం సాయంత్రం ఓ లారీ RTC బస్సును ఢీకొనడంతో అది వెళ్లి కారును ఢీకొంది. తాడికల్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై KNR నుంచి WGL వైపు వెళ్తున్న మెట్పల్లి డిపో RTC బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేస్తుండగా లారీ ఢీకొట్టింది. అదే సమయంలో HZBD నుంచి KNR వైపు ఎదురుగా వస్తున్న ఓ కారును ఈ బస్సు ఢీకొంది. బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరూ సురక్షితంగా బయటపడ్డారు.
Similar News
News December 1, 2025
2026లోనే తేలనున్న కృష్ణా జలాల వివాదం!

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదంపై ట్రిబ్యునల్-II తన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించలేదని కేంద్రమంత్రి రాజ్ భూషణ్ వెల్లడించారు. నిర్ణయాన్ని వెల్లడించేందుకు గడువు పొడిగించాలని ట్రిబ్యునల్ కోరిందన్నారు. దీంతో 2025 AUG 1 నుంచి జులై 31 వరకు గడువు ఇచ్చినట్లు తెలిపారు. ఎంపీ అనిల్ కుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో నీటి పంపకాల పంచాయితీకి వచ్చే ఏడాదే ముగింపు దొరకనుంది.
News December 1, 2025
WNP: అధికారులు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి

ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని, తమ విధులు,బాధ్యతలపై పూర్తి అవగాహన పెంచుకుని పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం మదనాపురం జెడ్పి బాయ్స్ హైస్కూల్ నిర్వహించిన ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
News December 1, 2025
పెద్దపల్లి: 35 కంప్యూటర్ల సరఫరాకు దరఖాస్తుల ఆహ్వానం

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ పాఠశాలలకు 35 కంప్యూటర్ల సరఫరా కోసం ఆసక్తి గల సరఫరాదారులు డిసెంబర్ 4లోగా దరఖాస్తులు సమర్పించాలని ఇన్చార్జ్ డీఈఓ శారద తెలిపారు. దరఖాస్తులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో స్వీకరించబడతాయి. వివరాలకు సెక్టోరల్ అధికారి సి.హెచ్. మల్లేష్ గౌడ్ (ఫోన్: 9959262737) ను సంప్రదించవచ్చు.


