News April 13, 2025
కరీంనగర్ జిల్లాలో యాక్సిడెంట్

శంకరపట్నంలో శనివారం సాయంత్రం ఓ లారీ RTC బస్సును ఢీకొనడంతో అది వెళ్లి కారును ఢీకొంది. తాడికల్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై KNR నుంచి WGL వైపు వెళ్తున్న మెట్పల్లి డిపో RTC బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేస్తుండగా లారీ ఢీకొట్టింది. అదే సమయంలో HZBD నుంచి KNR వైపు ఎదురుగా వస్తున్న ఓ కారును ఈ బస్సు ఢీకొంది. బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరూ సురక్షితంగా బయటపడ్డారు.
Similar News
News November 16, 2025
కొహీర్: కనిష్టంగా 8.1 ఉష్ణోగ్రత నమోదు

సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత రోజుకు తీవ్రంగా పెరుగుతుంది. కోహిర్ మండలంలో కనిష్టంగా 8.1 ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఆ తరువాత ఝరాసంఘం 8.8, సదాశివపేట 9.0, గుమ్మడిదల 9.4, కంగ్టి 9.5, నిజాంపేట 9.7 ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. చలి తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
News November 16, 2025
నేడు కోరుట్లలో ఉమ్మడి జిల్లా స్థాయి ఖోఖో పోటీలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి 18 సంవత్సరాల లోపు బాలబాలికల ఖోఖో టోర్నమెంట్ కం సెలక్షన్స్ నేడు కోరుట్ల కాలేజ్ గ్రౌండ్లో జరగనున్నాయి. కోరుట్ల స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 28 నుంచి 30 వరకు మెదక్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో పాల్గొననున్నారు. క్రీడాకారులందరూ సకాలంలో హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.
News November 16, 2025
ఎంపీడీవోల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పెగడపల్లి ఎంపీడీవో

తెలంగాణ ఎంపీడీవోల యూనియన్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా పెగడపల్లి ఎంపీడీవో ప్రేమ్ సాగర్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి గౌతమ్ రెడ్డి శనివారం తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపికవడం పట్ల పెగడపల్లి ఎంపీడీఓ ప్రేమ్ సాగర్ ను ఎంపీఓ శశి కుమార్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.


