News December 4, 2024

కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మంచిర్యాల వ్యక్తి మృతి

image

కరీంనగర్ మండలం మొగ్దుంపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మంచిర్యాల నుంచి బైకుపై ఇద్దరు కరీంనగర్ వైపు వెళ్తుండగా.. ఓ లారీ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంది. దీంతో వారు లారీని వెనుకనుంచి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో చెన్నూర్‌కు చెందిన సాగర్ మృతిచెందారు. దండేపల్లి మండలం కన్నేపల్లికి చెందిన శ్రీనుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108కి సమాచారమిచ్చి గాయపడిన వ్యక్తిని KNR GOVT ఆసుపత్రికి తరలించారు..

Similar News

News December 10, 2025

ADB: అన్న పైసలు వేసిన.. రేపు వస్తున్నావా..!

image

పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ గురువారం జరగనున్న విషయం తెలిసిందే. దీంతో పట్టణాల్లో ఉన్న పల్లె ఓటర్లకు సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు తెగ ఫోన్లు చేస్తున్నారు. ”అన్న ఎట్లున్నవే.. పైసలేసిన రేపు వచ్చి ఓటేయండి మీ ఓటే నా గెలుపును డిసైడ్ చేస్తుంది.. తప్పకుండా రావాలి” అని వేడుకుంటున్నారు. ఇదే అదనుగా ఓటర్లు తమ ట్రావెలింగ్, ఇతర ఖర్చులతో పాటు అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.

News December 10, 2025

ADB: 166 సర్పంచ్, 1392 వార్డ్ స్థానాలకు ఎన్నికలు

image

ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 6 మండలాల్లో 166 సర్పంచ్, 1392 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పోలింగ్ సామగ్రి పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సరిపడినంత సిబ్బందిని నియమించడంతో పాటు వారికి శిక్షణ పూర్తి చేశామని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని వివరించారు.

News December 9, 2025

ADB: ప్రచారం ముగిసింది.. పోలింగ్ మిగిలింది

image

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి సెక్షన్ 163 BNSS అమలులోకి వస్తుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమని పేర్కొన్నారు.​ ఇప్పటి నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఆ ప్రాంతాలలో అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలన్నారు. పోలింగ్ డిసెంబర్ 11 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని, అదే రోజు ఫలితాలు వస్తాయన్నారు.