News February 16, 2025
కరీంనగర్: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో.!

KNR, NZB, ADB, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా బావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Similar News
News December 4, 2025
మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న మంత్రి

మేడారం సమ్మక్క-సారలమ్మలను గురువారం రాత్రి మంత్రి సీతక్క దర్శించుకున్నారు. 2026 జనవరిలో జరిగే మహాజాతర సందర్భంగా జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. పగిడిద్దరాజు, గోవిందరాజుల నూతన గద్దెల పనులను పరిశీలించిన మంత్రి.. జాతర ముందే నిర్మాణ పనులను పూర్తి చేస్తామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
News December 4, 2025
సిగాచి బాధితులకు కోటి పరిహారం ఇవ్వాలి: జేఏసీ

పాశమైలారం సమీపంలోని సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం వెంటనే ఇవ్వాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ జిల్లా చైర్మన్ వై. అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం పరిశ్రమ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఇప్పటివరకు ఎనిమిది మందికి డెత్ సర్టిఫికేట్లు ఇవ్వలేదని ఆరోపించారు. కార్మికులకు న్యాయం జరగకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
News December 4, 2025
11వ తేదీ కడప మేయర్ ఎన్నిక జరగకపోతే?

కడప మేయర్ ఎన్నికకు <<18470673>>నోటిఫికేషన్<<>> విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని పేర్కొన్నారు. ఒకవేళ 11వ తేదీ ఎన్నిక జరగకపోతే.. రిజర్వ్ డే (12వ తేది)న ఎన్నిక ఉంటుందని స్పష్టం చేశారు. అప్పటికీ ఎన్నిక జరగకుంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ తర్వాతి తేదీని వెల్లడిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


