News March 24, 2025
కరీంనగర్: డిప్లమో కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

టెక్స్ టైల్ టెక్నాలజీ డిప్లమో కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా జౌలి చేనేత శాఖ సహాయ సంచాలకులు సోమవారం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా మంజూరైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ హైదరాబాద్ నందు మొదటి సంవత్సరానికి 60 సీట్లు ఉన్నాయన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఏప్రిల్ మొదటి వారంలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News November 22, 2025
NZB: ‘ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి’

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఏ ఒక్క రైతు కూడా ఇబ్బందికి గురి కాకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం సహకార సంఘాల ఇన్ఛార్జ్లతో కలెక్టర్ కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సమీక్ష జరిపారు. ఇప్పటికే జిల్లాలో పెద్ద ఎత్తున ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ తెలిపారు.
News November 22, 2025
కరీంనగర్: జాగృతి బలోపేతానికి మండల కమిటీల ఏర్పాటు

జాగృతి జిల్లా కార్యాలయంలో శనివారం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. కరీంనగర్ జిల్లాలో సంస్థ బలోపేతానికి త్వరలోనే అన్ని మండల కమిటీలను పూర్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ కమిటీల ఎన్నికల కోసం అన్ని మండలాలకు తక్షణమే ఇన్చార్జ్లను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
News November 22, 2025
గ్లోబల్ సమ్మిట్: తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ముసాయిదా ISB ఖరారు

TG: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ( ISB) “తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్” ముసాయిదాను రూపొందించింది. ఐటీ, పరిశ్రమ, పర్యాటకం, విద్య, ఆరోగ్యం, చిత్రపరిశ్రమల అభివృద్ధిపై ఇది రూపొందింది. 3 ట్రిలియన్ USD ఆర్థిక వ్యవస్థను సాధించడంతో పాటు మహిళ, రైతు, యువత సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అన్ని శాఖలతో చర్చించి ISB రూపొందించిన ఈ డాక్యుమెంట్ను DEC తొలివారంలో క్యాబినెట్ భేటీలో ఆమోదించనున్నారు.


