News February 16, 2025
కరీంనగర్: తల్లి, ఇద్దరు పిల్లల మృతిపై ఎస్సై వివరాల వెల్లడి

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎస్ఐ రవి కిరణ్ కరీంనగర్‌లో మీడియాతో వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా మద్దులపల్లి గ్రామానికి చెందిన <<15478542>>హారిక<<>> ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తాను తాగిందని చెప్పారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ తల్లి హారిక మృతిచెందగా, ఇద్దరు పిల్లలు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News September 19, 2025
సెప్టెంబర్ 19: చరిత్రలో ఈరోజు

✒ 1887: రచయిత, నాస్తికుడు తాపీ ధర్మారావు జననం
✒ 1911: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బోయి భీమన్న జననం
✒ 1924: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు కాటం లక్ష్మీనారాయణ జననం
✒ 1960: భారత్-పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం(ఫొటోలో)
✒ 1977: క్రికెటర్ ఆకాశ్ చోప్రా జననం
✒ 1965: నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ జననం
News September 19, 2025
ఒక్క రోజులోనే ఎంప్లాయ్మెంట్ కార్డు: సాహితీ

యువతకు ఎంప్లాయిమెంట్ కార్యాలయం జారీ చేసే ఎంప్లాయిమెంట్ కార్డు తప్పనిసరని జిల్లా ఉపాధి అధికారిణి సాహితీ తెలిపారు. గతంలో కార్డు మూడేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడు ఒక్కసారి కార్డు తీసుకుంటే ఇక శాశ్వతంగా ఉంటుందన్నారు. మీసేవ కేంద్రాలు, ఫోన్ నుంచి employment.telangana.gov.inలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న ఒక్కరోజులోనే కార్డు జారీ చేస్తామని వెల్లడించారు.
News September 19, 2025
అఫ్గానిస్థాన్‌పై శ్రీలంక విజయం

ఆసియా కప్: అఫ్గానిస్థాన్‌పై శ్రీలంక 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 169-8 రన్స్ చేసింది. AFG బ్యాటర్లలో నబి(60), SL బౌలర్లలో తుషారా 4 వికెట్లతో రాణించారు. లంక ఓపెనర్ కుశాల్ మెండిస్(74) చెలరేగడంతో 170 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు. AFG బౌలర్లలో ముజీబ్, అజ్మతుల్లా, నబి, నూర్ తలో వికెట్ తీశారు. లంక సూపర్ 4కు క్వాలిఫై అవ్వగా.. AFG టోర్నీ నుంచి ఎలిమినేటైంది.