News February 16, 2025

కరీంనగర్: తల్లి, ఇద్దరు పిల్లల మృతిపై ఎస్సై వివరాల వెల్లడి

image

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎస్ఐ రవి కిరణ్ కరీంనగర్‌లో మీడియాతో వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా మద్దులపల్లి గ్రామానికి చెందిన <<15478542>>హారిక<<>> ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తాను తాగిందని చెప్పారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ తల్లి హారిక మృతిచెందగా, ఇద్దరు పిల్లలు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News July 6, 2025

పోరుమామిళ్ల: నకిలీ కానిస్టేబుల్‌పై ఫిర్యాదు

image

పోరుమామిళ్ల మండలం కమ్మవారిపల్లెకి చెందిన ఓ యువతి సత్యసాయి జిల్లా తుమ్మలవారిపల్లెకి చెందిన భాను ప్రకాశ్‌ను 7 నెలల క్రితం వివాహం చేసుకుంది. అతను హైదరాబాదులో AR కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు నమ్మించి మోసం చేసి వివాహం చేసుకున్నాడని యువతి తెలిపింది. అంతేకాకుండా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శనివారం పోరుమామిళ్ల PS‌లో ఫిర్యాదు చేసింది.

News July 6, 2025

జులై 13 నుంచి వెబ్ ఆప్షన్లు

image

AP: EAPCET, ఫార్మసీ కాలేజీల వెబ్ ఆప్షన్ల నమోదును ఈ నెల 13 నుంచి నిర్వహించనున్నారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10 నుంచి జరగాల్సి ఉండగా, 13వ తేదీకి మార్చారు. ఇంజినీరింగ్ కాలేజీలకు యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు, ప్రభుత్వ అనుమతులు రావడానికి ఆలస్యం కారణంగానే వెబ్ ఆప్షన్ల నమోదు షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు.

News July 6, 2025

విజయవాడ: రాత పరీక్ష లేకుండా 170 ఉద్యోగాల భర్తీ

image

విజయవాడలోని AP స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌లో కాంట్రాక్ట్ పద్ధతిన 170 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారు https://www.sthreenidhi.ap.gov.in/లో ఈ నెల 7 నుంచి 18 లోపు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ MD హరిప్రసాద్ తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.25,520 వేతనం ఇస్తామని, పూర్తి వివరాలకు పైన ఇచ్చిన వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.