News February 17, 2025
కరీంనగర్: తాగుడుకు బానిసై వృద్ధుడి ఆత్మహత్య

శంకరపట్నం మండలం మెట్పల్లిలో ముప్పిడి రామ్ రెడ్డి (72)అనే వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరుకు చెందిన రామ్ రెడ్డి తన మేన బామ్మర్ది తుమ్మల పురుషోత్తం రెడ్డి ఇంటివద్ద ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని కుటుంబ సభ్యులు దూరమడం వలన మనోవేదనతో తాగుడుకు బానిసై ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పురుషోత్తం రెడ్డి పేర్కొన్నాడు.
Similar News
News November 22, 2025
విజయవాడ ఆసుపత్రిలో అరుదైన చికిత్స

విజయవాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ ను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ఏలూరుకు చెందిన యువకుడు తేజ వికాస్ మహిళ గొంతుతో మాట్లాడేవాడు. ఈఎన్టీ వైద్యులు డాక్టర్ రవి రోగిని పరీక్షించి ప్యూబర్ఫోనియా వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. దీని కోసం టైప్-3 థైరొప్లాస్టీ శస్త్రచికిత్స ఉత్తమ మార్గమని నిర్ధారించి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం రోగికి మహిళ వాయిస్ పోయి, పురుషుడు గొంతుతో మాట వస్తోందన్నారు.
News November 22, 2025
భద్రాద్రి: ‘హిడ్మాను పట్టుకొని చంపేశారు’

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా, ఆయన సహచరి రాజేలను పోలీసులు ప్రాణాలతో పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపేశారని, ఆ తర్వాతే ఎన్కౌంటర్ పేరిట కట్టుకథలు చెబుతున్నారని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేఖ విడుదలైంది. హిడ్మా హత్యను నిరసిస్తూ, ఈ నెల 23న దేశవ్యాప్తంగా బంద్ పాటించాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. నవంబరు 20న రాసిన ఈ లేఖ శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
News November 22, 2025
HYD: బీసీ కమిషన్ రిపోర్ట్కు కేబినెట్ ఆమోదం

తెలంగాణలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఈ నివేదిక ఆధారంగా పంచాయతీ రాజ్ శాఖ నేడు జీవోను విడుదల చేయనుంది. జిల్లా కలెక్టర్లు నవంబర్ 23వ తేదీ సాయంత్రం 6 గంటలలోగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని ఆదేశించారు. పూర్తి నివేదికను పంచాయతీ రాజ్ శాఖ నవంబర్ 24వ తేదీన కోర్టుకు సమర్పించనుంది. ఈ నిర్ణయం ద్వారా రిజర్వేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని భావిస్తున్నారు.


