News April 11, 2025
కరీంనగర్: తీవ్ర రక్తస్రావంతో చికిత్స పొందుతూ గర్భిణి మృతి

కరీంనగర్ మాతా శిశు కేంద్రంలో చికిత్స పొందుతూ సంధ్య అనే గర్భిణి మృతి చెందినట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు. మంచిర్యాల జిల్లాకు చెందిన సంధ్య తీవ్ర రక్తస్రావంతో అక్కడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని, మెరుగైన వైద్యం కోసం నగరంలోని మాతాశిశు ఆసుపత్రికి వచ్చింది. కాగా తీవ్ర రక్తస్రావంతో మృతి చెందినట్లు మృతురాలి భర్త జగదీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Similar News
News April 18, 2025
కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న ఎండ తీవ్రత

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 41.3°C నమోదు కాగా, మానకొండూర్ 40.9, గన్నేరువరం 40.4, రామడుగు 40.2, జమ్మికుంట 40.1, చొప్పదండి 39.9, తిమ్మాపూర్ 39.7, చిగురుమామిడి 39.6, శంకరపట్నం 39.5, కరీంనగర్ రూరల్ 39.4, సైదాపూర్ 39.3, కరీంనగర్ 39.2, వీణవంక 39.0, కొత్తపల్లి 38.6, హుజూరాబాద్ 38.4, ఇల్లందకుంట 38.0°C గా నమోదైంది.
News April 18, 2025
రేపు హుజురాబాద్‌లో స్వచ్భ ఎగ్జిబిషన్: మున్సిపల్ కమిషనర్

హుజురాబాద్ పట్టణంలోని సాయి రూప ఫంక్షన్ హాల్‌లో ఈ నెల 19న స్వచ్ఛ ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. జిల్లాలోనే తొలిసారిగా పర్యావరణంపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు,, జమ్మికుంట కృషి విజ్ఞాన శాస్త్రవేత్తలు ఎగ్జిబిషన్లను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో ముఖ్య అతిథులుగా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొంటారాని తెలిపారు.
News April 18, 2025
కేసీఆర్ సెంటిమెంట్.. ఉమ్మడి KNRలో BRS సభ

KCRకు సెంటిమెంట్ జిల్లా అయిన ఉమ్మడి KNR(ఎల్కతుర్తి)లో ఈనెల 27న BRS రజతోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. 20లక్షల మందితో 1500ఎకరాల్లో సభ ఏర్పాటు చేయనున్నారు. TRSని పెడుతున్నట్లు మొదటిసారిగా KNR గడ్డపైనే KCR ప్రకటించారు. రైతుబంధు, దళితబంధు పథకాలను కూడా ఈ జిల్లాలోనే ప్రారంభించారు. అధికారం కొల్పోయిన తర్వాత ఉమ్మడి KNR(ఎల్కతుర్తి)లో BRS మొదటిసారిగా భారీఎత్తున సభ పెడుతున్నందున ఆసక్తి నెలకొంది.