News January 26, 2025
కరీంనగర్: త్రివర్ణపతాకం రూపంలో సూర్యాస్తమయం

గణతంత్ర దినోత్సవం నాడు కరీంనగర్ జిల్లాలో అద్భుత దృశ్యం Way2News కెమెరాకు చిక్కింది. జమ్మికుంట మండలం సైదాబాద్‌లో సూర్యాస్తమయ సమయంలో త్రిపర్ణపతాకం ఆకారం ఆవిష్కృతమైంది. పంటపొలాలు, మధ్యలో ఆకాశం, పైన సూర్యాస్తమయ ఆకాశం ఈ మూడు కలగలిసి త్రివర్ణ పతాకాన్ని ఏర్పరిచాయి. ఇది చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Similar News
News January 9, 2026
నాణ్యత లేదని కొన్న పంటను తిరిగి పంపేశారు

TG: సోయాపంట విక్రయించిన రైతులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రైతులు అమ్మిన సోయా గింజల్లో నాణ్యత లేదంటూ వేలాది క్వింటాళ్ల సోయా బస్తాలను వెనక్కి తిరిగి పంపుతున్నారు. ఆ బస్తాలను తిరిగి తీసుకెళ్లాలని రైతులకు ఫోన్ చేసి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు చెప్తున్నారు. దీంతో ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి సహా ఇతర జిల్లాల్లో సోయా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
News January 9, 2026
నల్గొండ: ఊసే లేని రూ.12 వేల ఆర్థిక సాయం!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. పథకాలు ప్రారంభించడమే తప్ప కాంగ్రెస్ అమలు చేయడం లేదంటూ సర్కార్ తీరుపై కూలీలు మండిపడుతున్నారు. భూమిలేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రజాపాలన గ్రామ సభల్లో NLG నుంచి 15,485, సూర్యాపేటలో 22,186, యాదాద్రిలో 11,551 మంది దరఖాస్తు చేసుకున్నారు.
News January 9, 2026
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ట్రంప్ సుంకాల వార్నింగ్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై ఇవాళ కూడా కనిపిస్తోంది. సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టపోయి 66,907 వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు కోల్పోయి 25,861 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ICICI బ్యాంక్, అదానీ పోర్ట్స్, NTPC, ట్రెంట్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, HDFC, హిందుస్తాన్ యునిలీవర్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిన్న మార్కెట్లు భారీ నష్టాల్లో ముగియడంతో రూ.7.69 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.


