News August 9, 2024

కరీంనగర్: దళితబంధుపై ‘కాగ్’ సంచలన నివేదిక

image

గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధుపై ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) లోపాలను ఎత్తిచూపింది. హుజూరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాల్లో పథకం అనుకున్న మేర అమలు కాలేదని, తీవ్ర జాప్యం జరిగిందని స్పష్టం చేసింది. అసలు దళితబంధు కోసం కేటాయించిన నిధుల్లో ప్రభుత్వం కేవలం 47 శాతం ఖర్చు చేసిందని, దాదాపుగా రూ.1300 కోట్లకు పైగా ఇంకా అలాగే ఉండిపోయాయని తన నివేదికలో వివరించింది.

Similar News

News September 11, 2024

ఈనెల 17న జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్న మంత్రి, విప్

image

సెప్టెంబర్ 17న రాష్ట్రంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని, జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్‌లు జాతీయ పతాక ఆవిష్కరణ చేయాలని సీఎస్ శాంతి కుమారీ ఉత్తర్వులు జారీ జారీచేశారు.

News September 11, 2024

ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన రామగుండం MLA

image

హైదరాబాద్ సెక్రటేరియట్లో ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. నియోజకవర్గం అభివృద్ధి గురించి కాసేపు చర్చించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు, కటుకు ధనుంజయ్, అరగంట కృష్ణ, జనగాం శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.

News September 11, 2024

వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: కలెక్టర్, ఎస్పీ

image

వినాయక నిమజ్జనోత్సవాలు ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. బుధవారం మెట్పల్లి పట్టణంలో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసే వాగు ప్రాంతాన్ని వారు పరిశీలించారు. వాగు ఒడ్డుకు హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని స్థానిక అధికారులను ఆదేశించారు. నిమజ్జనం ఉత్సవాలు రాత్రివేళ ఉంటాయని, పట్టణంలోని అన్ని వీధుల్లో వీధిలైట్లు ఉండాలన్నారు.