News December 24, 2024
కరీంనగర్: దివ్యాంగులకు జాబ్ మేళా
కరీంనగర్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో గ్రాస్ రూట్ అకాడమీ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో 27 డిసెంబర్ 2024న దివ్యాంగుల కోసం ఉద్యోగమేళాను నిర్వహిస్తున్నామని జిల్లా సంక్షేమ అధికారి కె సబితా కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్ మేళా నిర్వహిస్తామని, 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అర్హులని తెలిపారు.
Similar News
News December 26, 2024
రాహుల్ గాంధీకి ధన్యవాదాలు: మంత్రి పొన్నం
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పొన్నం ప్రభాకర్‌కు లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో రవాణా, బీసీ సంక్షేమ శాఖలో చేపడుతున్న చర్యలు అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం (ఎక్స్) ద్వారా స్పందించారు. తెలంగాణ ప్రగతిని గుర్తించినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. మీ మార్గదర్శకత్వం మాకు స్ఫూర్తినిస్తుంది అని ట్వీట్ చేశారు.
News December 25, 2024
KNR: BJP కొత్త సారథులు ఎవరు?
ఉమ్మడి KNRజిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి KNR, JGTL, SRCL, PDPL జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?
News December 25, 2024
హుజురాబాద్: ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి బలవర్మరణం
ప్రేమ పేరిట యువకుడి వేధింపులకు తట్టుకోలేక యువతి బలవర్మరణానికి పాల్పడిన ఘటన KNR జిల్లా HZB మం.లో జరిగింది. CI తిరుమల్ గౌడ్ వివరాలు.. ఇప్పల నర్సింగాపూర్‌కు చెందిన వరుణ్‌ప్రియ(18) అమ్మమ్మ ఊరైన పెద్ద పాపయ్యపల్లికి వచ్చి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. కాగా, కూతురి మృతికి అదే గ్రామానికి చెందిన అజయ్(19) వేధింపులే కారణమని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదయింది.