News June 28, 2024
కరీంనగర్: నర్సింహులపల్లిలో అరుదైన విగ్రహం!
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నర్సింహులపల్లిలో నాలుగో శతాబ్దం నాటి సున్నపు రాతితో చేసిన 3 అంగుళాల ఎత్తున్న అరుదైన వరాహమూర్తి శిల్పాన్ని గుర్తించినట్లు తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ఉత్తరాభిముఖుడైన ఈ మూర్తి అపురూపమైనదని శిల్పాన్ని పరిశీలించిన స్థపతి చరిత్రకారులు డా.ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. గతంలో ఇదే గ్రామంలో పురాతన రాతి పరికరాలు లభించినట్లు వారు గుర్తు చేశారు.
Similar News
News December 12, 2024
కాళేశ్వరం: సరస్వతీ పుష్కరాలకు మాస్టర్ ప్లాన్
కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో వచ్చే ఏడాది మే 15 నుంచి జరిగే సరస్వతీ పుష్కరాల కోసం అధికారులు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించిన నిర్మాణ రంగ సంస్థ నిపుణులు ఆలయంలో భక్తుల క్యూలైన్లు, వచ్చి పోయే మార్గాలు, రహదారులను పరిశీలించారు. వాహనాల పార్కింగ్, వీఐపీ, పుష్కర ఘాట్, ప్రధాన రహదారులను సందర్శించారు. ప్లాన్ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపనున్నారు.
News December 12, 2024
ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణాను ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా, ఆధునిక సాంకేతికతకు చిరునామాగా అభివృద్ధి చేయడంలో తమ ప్రభుత్వం నిరంతరం పాటుపడుతోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. కృత్రిమ మేధ, జీవశాస్త్రాలు, టెక్నాలజీ రంగాల్లో దిగ్గజ సంస్థలను ఆకర్షించడం ద్వారా ఇప్పటికే పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా నిలిచిందని ఆయన తెలిపారు.
News December 11, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ప్రధానాంశాలు
☞ పంచాయతీ అవార్డు అందుకున్న పెద్దపల్లి కలెక్టర్
☞ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న సీఎం క్రికెట్ కప్
☞ గ్రూప్-2 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి: కరీంనగర్ కలెక్టర్
☞ హుస్నాబాద్‌లో బైక్ ర్యాలీ నిర్వహించిన బీజేపీ నేతలు
☞ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా గీతా జయంతి వేడుకలు
☞ ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్
☞ ఎల్కతుర్తి: పేకాట ఆడుతున్న ఏడుగురు అరెస్ట్