News June 28, 2024
కరీంనగర్: నియామకపత్రం అందుకున్నా ‘నో జాబ్’!

నియామకపత్రం అందుకున్నప్పటికీ ఓ అభ్యర్థిని ఉద్యోగానికి దూరమైంది. కరీంనగర్ (D) గంగాధర (M) నారాయణపూర్‌కు చెందిన భానుప్రియ గురుకులంలో PGT గణితం దివ్యాంగుల కోటాలో ఎంపికై నియామకపత్రం అందుకుంది. 40% వైకల్యం ఉన్నవారు దివ్యాంగులుగా అర్హులు కాగా ఆమెకు 68% ఉన్నట్లు సదరం క్యాంపులో గుర్తించారు.అయితే తాజా వైద్య పరీక్షల్లో 39% వైకల్యం ఉందని తేలడంతో ఆమె ఉద్యోగానికి అనర్హురాలంటూ తేల్చారు. న్యాయం చేయాలని కోరుతోంది.
Similar News
News December 9, 2025
KNR: నకిలీ బ్యాలెట్ పత్రాలు.. సర్పంచ్ అభ్యర్థి సహా నలుగురిపై కేసు

మానకొండూరు మండలం చెంజర్లలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ నకిలీ నమూనా బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేసినందుకు సర్పంచ్ అభ్యర్థి గడ్ది రేణుక(కత్తెర గుర్తు)తో సహా నలుగురిపై కేసు నమోదైంది. వీరు ఫుట్‌బాల్ గుర్తు అభ్యర్థి సీరియల్ నంబర్‌ను తప్పుగా ముద్రించి, NOTA స్థానంలో సరైన సీరియల్ నంబర్‌ను ఉంచి ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు యత్నించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
News December 9, 2025
KNR కమిషనరేట్‌లో 19 శాతం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు

కరీంనగర్ జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. కమిషనరేట్‌లో 19 శాతం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మొత్తం 104 క్లస్టర్లలో పెట్రోలింగ్‌తో పాటు, ఏసీపీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్‌ను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
News December 9, 2025
‘ఐదుగురు, అంతకంటే ఎక్కువమంది గుమికూడొద్దు’

కరీంనగర్ తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు CP గౌష్ ఆలం తెలిపారు. రూరల్ డివిజన్లోని ఐదు మండలాల్లో BNSS సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించామన్నారు. ఈ ఉత్తర్వులు ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి DEC 11 రాత్రి 11:59 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడటంపై పూర్తి నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు.


