News February 1, 2025
కరీంనగర్: నిర్మలమ్మ పద్దుపైనే ఆశలు..!

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం లోకసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై KNR జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణం పూర్తి, కరీంనగర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతిరోజు నడిచే విధంగా చర్యలు, జిల్లాలో భారత్ మాల పథకంలో జాతీయ రహదారుల విస్తరణ, జమ్మికుంట రైల్వే స్టేషన్లో పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్ కల్పించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.
Similar News
News March 14, 2025
పోలీసుల కస్టడీలో పెద్దపల్లి వాసి అనుమానాస్పద మృతి

నిజామాబాద్‌లో పోలీసుల కస్టడీలో ఉన్న ఒక గల్ఫ్ ఏజెంట్ మృతిచెందాడు. బాధిత కుటుంబీకుల ప్రకారం.. JGTL చెందిన చిరంజీవి, PDPLకి చెందిన సంపత్ ఇరువురు కలిసి గల్ఫ్‌కు కొందరిని పంపించారు. తీరా అక్కడికి వెళ్లిన వారికి పనిలేకపోవడంతో వారు తిరిగొచ్చి సంపత్, చిరంజీవిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ద్వారా 2రోజుల క్రితం కస్టడీలోకి తీసుకోగా సంపత్ మృతిచెందాడు.
News March 14, 2025
ALERT: KNR జిల్లాలో 40°C ఉష్ణోగ్రతలు

KNR జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. గడచిన 24 గంటల్లో అత్యధికంగా ఈదులగట్టేపల్లి, కొత్తపల్లి-ధర్మారం, గంగాధర, నుస్తులాపూర్, ఇందుర్తి 40.0°C నమోదు కాగా, జమ్మికుంట, మల్యాల 39.9, దుర్శేడ్ 39.6, వీణవంక, KNR 39.5, చిగురుమామిడి 39.4, కొత్తగట్టు, తాడికల్, గుండి 39.3, ఖాసీంపేట 39.1, రేణికుంట 39.0, తాంగుల 38.9, వెంకేపల్లి 38.8, చింతకుంట, బురుగుపల్లి 38.5, గట్టుదుద్దెనపల్లె 38.4°C గా నమోదైంది.
News March 14, 2025
కరీంనగర్: ప్రతి భవిత విద్యార్థికి ప్రొఫైల్ సిద్ధం చేయాలి: కలెక్టర్

భవిత కేంద్రాలలో ప్రత్యేక విద్య నేర్చుకుంటున్న ప్రతి దివ్యాంగ విద్యార్థికి ప్రొఫైల్ సిద్ధం చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. భవిత కేంద్రాలలో పనిచేస్తున్న ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్స్‌తో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. దివ్యాంగులకు మంజూరు చేసే యుడిఐడి కార్డుల పట్ల భవిత విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు.