News February 26, 2026
కరీంనగర్ నూతన కొత్త కలెక్టర్ చిత్ర మిశ్రా ప్రొఫైల్

కరీంనగర్ జిల్లా పాలనా పగ్గాలను 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి చిత్ర మిశ్రా చేపట్టారు. సంగారెడ్డికి చెందిన ఆమె, నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా, మున్సిపల్ కమిషనర్‌గా సమర్థవంతంగా పనిచేశారు. ఇటీవల ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో విశేష కృషి చేశారు. యువ అధికారిణి రాకతో కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో సరికొత్త వేగం పుంజుకోనుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
Similar News
News April 14, 2026
KNR: ‘ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి’

కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తోన్న అరైవ్ – అలైవ్ రోడ్డు భద్రత వారోత్సవాల వాల్ పోస్టర్లను సోమవారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. అరైవ్ – అలైవ్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
News April 12, 2026
ఇంటర్ సెకండియర్ RESULTS.. కరీంనగర్‌కు 7వ ర్యాంకు

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. కరీంనగర్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 14943 మంది పరీక్షలు రాయగా 11961 మంది పాసై 80.04 శాతంతో స్టేట్‌లోనే 7వ ర్యాంకు వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 1320 మందికి 876 మంది పాసై 66.36 శాతంతో 30వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 1837 మందికి 591 మంది పాసై 32.17%తో 16వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 163 మందికి 71 మంది పాసై 43.56%తో 28th ప్లేస్ వచ్చింది.
News April 12, 2026
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. కరీంనగర్‌కు 6వ ర్యాంకు

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. కరీంనగర్ జిల్లాలో రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు 16726 మంది పరీక్ష రాయగా 11737 మంది పాసై 70.17 శాతంతో స్టేట్‌లోనే 6వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 1,449 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 822 మంది విద్యార్థులు పాసై 56.73 శాతంతో స్టేట్‌లో 24వ స్థానంలో నిలిచింది.


