News March 7, 2025
కరీంనగర్: నూతన సీపీ గౌస్ ఆలం బయోడేటా

KNR నూతన సీపీ గౌస్ ఆలం బిహార్‌లోని గయాలో జన్మించారు. IIT ముంబైలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. 2017 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన గౌస్ ఆలం శిక్షణలో పరేడ్ కమాండర్‌గా వ్యవహరించి బెస్ట్ అల్రౌండర్ అవార్డు సాధించారు. మొట్టమొదటగా ఏటూరునాగారం ASP విధులు నిర్వహించారు. అనంతరం ఖమ్మం OSDగా పనిచేశారు. 2022లో ములుగు SPగా పనిచేశారు. 2024 జనవరిలో ADB SPగా బాధ్యతలు స్వీకరించి.. 2025 MAR 7న KNRకు బదిలీపై వచ్చారు.
Similar News
News May 8, 2025
KNR-2 డిపోను సందర్శించిన జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

KNR జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి పోలమన్ KNR–2 డిపోను సందర్శించారు. డిపోలో ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, ఛార్జింగ్ పాయింట్లు, వాటి మెంటేనెన్స్, ప్రాక్టీసెస్ గురించి వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన సేవల కోసం తగు సలహాలు సూచనలు ఇచ్చారు. అనంతరం KNR బస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో KNR RM బి.రాజు, అధికారులు ఉన్నారు.
News May 7, 2025
KNR: జిల్లా స్పోర్ట్స్ స్కూల్ రాష్ట్రంలోనే మోడల్‌గా నిలవాలి: కలెక్టర్

కరీంనగర్ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్లో చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. స్పోర్ట్స్ స్కూల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా ఉండేలా తీర్చిదిద్దాలని ఆమె సూచించారు.
News May 7, 2025
కరీంనగర్: రైతుల సంక్షేమం కోసమే భూభారతి: కలెక్టర్

రైతుల భూ సమస్యలు పరిష్కరించి,వారి సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ రైతువేదిక, కొత్తపల్లిలోని రైతువేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ధరణి చట్టంలో సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించలేదని, భూభారతి చట్టంలో మాత్రం పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించేందుకు వీలుంటుందన్నారు.