News August 8, 2024
కరీంనగర్: నెరవేరనున్న సొంతింటి కల!
దాదాపు నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్న LRS దరఖాస్తుదారుల కల త్వరలోనే నెరవేరబోతోంది. తమ స్థలంలో సొంతింటి నిర్మాణం చేపట్టేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లో దరఖాస్తులు పరిశీలించి క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. కాగా ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో పాటు 14 మున్సిపాలిటీల్లో 1,13,346 దరఖాస్తులు వచ్చాయి.
Similar News
News September 18, 2024
సిరిసిల్ల: పత్తి దిగుబడిపై దిగాలు
సిరిసిల్ల జిల్లాలో పత్తి పంట సాగు చేసిన రైతులు తెల్లబోతున్నారు. ఇటీవల తుఫాను ప్రభావంతో కురిసిన అధిక వర్గాలు పత్తి రైతులను పరేషాన్ చేస్తున్నాయి. భారీ వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడిపై ప్రభావం చూపింది. మరోవైపు తెగుళ్లు మొదలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆకులకు తెగుళ్లు సోకి ఎర్ర రంగులోకి మారుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. కాగా, జిల్లాలో 49,332 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు.
News September 18, 2024
నేడు జమ్మికుంటకు మహేశ్ గౌడ్
రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ MLA పొన్నం ప్రభాకర్ హనుమకొండ, జమ్మికుంట పట్టణాల్లో పర్యటించనున్నట్లు తన వ్యక్తిగత సహాయకులు తెలిపారు. టిపిసిసి అధ్యక్షులు మహేశ్ గౌడ్‌తో కలిసి 12 గంటలకు భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 2 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించే ధర్నాలో పాల్గొంటారు. 3 గంటలకు సమ్మిరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు.
News September 18, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,45,150 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,02,082, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.29,750, అన్నదానం రూ.13,318,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.