News February 17, 2025

కరీంనగర్ : నేటి సదరం క్యాంపు రద్దు

image

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో ఈ నెలలో 17 & 18 తేదిలలో జరుగు సదరం క్యాంపులను నిలిపివేసినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి శ్రీధర్ తెలిపారు. సదరం వెబ్‌సైట్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాలు కారణంగా నేడు సోమవారం, మంగళవారం నిర్వహించే సదరం క్యాంప్‌లు రద్దు చేశామన్నారు. 

Similar News

News September 19, 2025

KNR: సీపీఎస్‌ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడిగా షేక్ నిసార్ అహ్మద్

image

కరీంనగర్ జిల్లా సీపీఎస్‌ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మహమ్మద్ షేక్ నిసార్ అహ్మద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ సీపీఎస్‌ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్‌లోని రెవెన్యూ క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన నియామక పత్రాన్ని అందజేశారు. పాత పింఛన్ విధానం పునరుద్ధరణ కోసం షేక్ నిసార్ అహ్మద్ చేస్తున్న పోరాటాన్ని స్థితప్రజ్ఞ ప్రశంసించారు.

News September 18, 2025

KNR: ‘పని ప్రదేశాల్లో ఫిర్యాదుల కమిటీ తప్పనిసరి’

image

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టంపై జెడ్పీ సమావేశ మందిరంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ సభ్యులకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కంపెనీలు, కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నివారణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయడం తప్పనిసరి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

News September 18, 2025

‘కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను అప్పులపాలు చేసింది’

image

తెలంగాణను KCR కుటుంబం అప్పుల పాలు చేసిందని PCC ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం మండిపడ్డారు. KNRలోని R&B గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో హరీశ్‌రావు అవినీతికి పాల్పడ్డారని కవిత ఆరోపించగా, KCR సూత్రధారి అని హరీశ్‌రావు విచారణలో చెప్పారని అన్నారు. నయీం ఆస్తులను KCR తన ఖజానాలో జమచేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని గజ్జల కాంతం తీవ్ర ఆరోపణలు చేశారు.