News October 11, 2024
కరీంనగర్: నేడు కొత్తపల్లిలో సద్దుల బతుకమ్మ

రాష్ట్ర వ్యాప్తంగా అంతట ఏడు, తొమ్మిది రోజుల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తే కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో మాత్రం పదో రోజు జరుపుకొంటారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం కావడంతో శుక్రవారం కొత్తపల్లిలో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే మున్సిపల్ ఛైర్మన్ రుద్రరాజు, అధికారులు చెరువు కట్ట ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేశారు.
Similar News
News December 23, 2025
SRR కళాశాలలో బ్యూటీషియన్ కోర్సుకు గడువు పెంపు

KNR(D) SRR ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో బేసిక్ బ్యూటీషియన్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాలకు ఈనెల 31 వరకు గడువు ఉన్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు తరగతులు జనవరి 2 నుంచి ప్రారంభమవుతాయని, ఫీజు రూ. 2,000గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలకు కోర్సు కోఆర్డినేటర్, జంతుశాస్త్ర విభాగాధిపతి డా. కామాద్రి కిరణ్మయిని సంప్రదించాలని సూచించారు.
News December 23, 2025
హుజూరాబాద్ నుంచి శబరిమలకి సూపర్ లగ్జరీ సర్వీస్

హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల అయ్యప్ప స్వామి భక్తులకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ప్రతి ఏడాది మకరజ్యోతి, మండల పూజల సందర్భంగా లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలకి ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం హుజూరాబాద్ నుంచి నేరుగా శబరిమలకి ప్రత్యేక సూపర్ లగ్జరీ సర్వీసులను ఏర్పాటు చేసింది. జనవరి 12 సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ సర్వీసులు హుజూరాబాద్ డిపో నుంచి బయలుదేరుతాయని మేనేజర్ పేర్కొన్నారు.
News December 23, 2025
REWIND: కరీంనగర్: రాజకీయ రణక్షేత్రం..!

ఈ ఏడాది జిల్లాలో రాజకీయ వేడి ఏమాత్రం తగ్గలేదు. సంవత్సరం ఆరంభంలో జరిగిన MLC ఎన్నికల్లో హోరాహోరీ పోరు నడిచింది. చివరికి మేధావులు బీజేపీకి పట్టం కట్టారు. ఈ నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పల్లెల్లో సెగ పుట్టించాయి. ఈ ఎన్నికలు రాబోయే రాజకీయ పరిణామాలకు దిక్సూచిలా మారాయి. అధికార పార్టీకి గట్టి పోటీనిస్తూ BRS, BJPలు పోటాపోటీగా సీట్లు గెలుచుకోవడం జిల్లా రాజకీయాల్లో వేడిని పెంచింది.


