News October 11, 2024
కరీంనగర్: నేడు కొత్తపల్లిలో సద్దుల బతుకమ్మ
రాష్ట్ర వ్యాప్తంగా అంతట ఏడు, తొమ్మిది రోజుల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తే కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో మాత్రం పదో రోజు జరుపుకొంటారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం కావడంతో శుక్రవారం కొత్తపల్లిలో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే మున్సిపల్ ఛైర్మన్ రుద్రరాజు, అధికారులు చెరువు కట్ట ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేశారు.
Similar News
News November 7, 2024
బ్యాంకు గ్యారంటీ ఆధారంగా మిల్లర్లకు ధాన్యం కేటాయింపు: ఆర్.వి.కర్ణన్
రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యం ప్రకారం తప్పనిసరిగా బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి ఆర్.వి.కర్ణన్ అన్నారు. బుధవారం వరి ధాన్యం మిల్లింగ్ పై సివిల్ సప్లై అధికారులు, వరి ధాన్యం కొనుగోలు ఏజెన్సీల అధికారులు, రైస్ మిల్లర్లతో జిల్లా ప్రత్యేక అధికారి ఆర్.వి.కర్ణన్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు.
News November 7, 2024
రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరపాలి: ఆర్వి కర్ణన్
ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరిగే విధంగా చూడాలని జిల్లా ప్రత్యేక అధికారి ఆర్వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. మల్యాల మండలం రామన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి పరిశీలించారు. ధాన్యం మ్యాచరుకు వచ్చిన వెంటనే కొనుగోలు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. అదనపు కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, తాసిల్దార్, ఎంపీడీవో ఉన్నారు.
News November 6, 2024
KNR: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి.. UPDATE
KNR జిల్లా రామడుగు మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో <<14540335>>ఇద్దరు యువకులు<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. SI శేఖర్ వివరాల ప్రకారం.. రామడుగుకు చెందిన అరుణ్(20), శివాజీ(18) ఇంటర్ పూర్తి చేసి ఇంటివద్ద ఉంటున్నారు. అయితే నిన్న బైకుపై KNR వెళ్లి వస్తుండగా బొలెరో ఢీకొట్టడంతో శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. చెట్ట పొదల్లో పడిన అరుణ్‌ను స్థానికులు గుర్తించి ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.