News November 15, 2024

కరీంనగర్: నేడు డయల్ యువర్ ఆర్ఎం

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ప్రయాణికులకు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు RM సుచరిత తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రయాణికులు తెలిపిన సమయంలో తమ సమస్యలను లేదా ఫీడ్ బ్యాక్‌ను 9063403511 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు.

Similar News

News December 21, 2025

ముగిసిన ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలు

image

ఉమడి KNR జిల్లా స్థాయి మైనారిటీ బాలికల పాఠశాలల & కళాశాలల క్రీడా పోటీలు KNR జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఈ పోటీల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌గా మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల&కళాశాల చొప్పదండి బాలికలు -1, గంగాధర కైవసం చేసుకుంది. ఈ పోటీలకు వివిధ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల&కళాశాల నుంచి దాదాపు 800 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.

News December 21, 2025

కరీంనగర్: సోమవారం జరగాల్సిన ‘ప్రజావాణి’ రద్దు

image

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో, అధికారులు ఆ ఏర్పాట్లలో నిమగ్నమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తిరిగి ఈ నెల 29 నుంచి ప్రజావాణి యథాతథంగా కొనసాగుతుందని, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.

News December 20, 2025

కరీంనగర్: పోగొట్టుకున్న 60 మొబైల్ ఫోన్ల రికవరీ

image

పోగొట్టుకున్న ఫోన్లను కరీంనగర్ టౌన్ పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. CEIR పోర్టల్ ద్వారా రూ.10 లక్షల విలువైన 60 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ ఏసీపీ తెలిపారు. శనివారం వీటిని బాధితులకు అందజేశారు. మొబైల్స్ పోగొట్టుకున్న వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. పోలీసుల పనితీరుపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు.