News October 4, 2024

కరీంనగర్: నేడు ముద్దపప్పు బతుకమ్మ

image

కరీంనగర్ జిల్లాలో బతుకమ్మ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడోరోజు ‘ముద్దపప్పు బతుకమ్మ’గా అమ్మవారిని పూజిస్తారు. ఈరోజు మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, పూలతో బతుకమ్మను చేసి.. తామర పాత్రల్లో అలంకరిస్తారు. శిఖరంపై గౌరమ్మను ఉంచి పూజలు చేస్తారు. ప్రధానంగా ముద్దపప్పును నివేదిస్తారు కాబట్టి ‘ముద్దపప్పు బతుకమ్మ’గా పిలుస్తారు. మూడోరోజు వాయినంగా ముద్దపప్పు, సత్తుపిండి, పెసర్లు, బెల్లం కలిపి పెడతారు.

Similar News

News December 2, 2025

KNR: బహిరంగ మద్యపానంపై నిషేధం పొడిగింపు

image

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజల భద్రత, శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని డ్రోన్ల వినియోగం, భారీ డీజే సౌండ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలను ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. భద్రతాపరమైన అంశాలు, శబ్ద కాలుష్యం, మహిళల రక్షణ దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 2, 2025

KNR: ఎన్నికల బందోబస్తుపై సీపీ గౌష్ ఆలం సమీక్ష

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని కరీంనగర్‌ సీపీ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. సీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి సారించాలని, ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సూచించారు. రూట్ మొబైల్‌ బృందాలు నిరంతరం పర్యవేక్షించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

News December 2, 2025

సైబర్‌ నేరాలకు ‘ఫుల్‌స్టాప్‌’.. అవగాహనతోనే పరిష్కారం

image

మారుతున్న సాంకేతిక యుగంలో సైబర్‌ నేరాలపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కరీంనగర్‌ సీపీ గౌష్ ఆలం అన్నారు. సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ‘ఫ్రాడ్‌ కా ఫుల్‌స్టాప్‌ – సైబర్‌ క్లబ్‌’ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి, పోస్టర్ రిలీజ్ చేశారు. విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాడెట్‌లు ముందుకు వచ్చి సైబర్‌ సేఫ్టీ అంబాసిడర్లుగా ఎదగాలని సీపీ పిలుపునిచ్చారు.