News March 5, 2025

కరీంనగర్: నేడే పరీక్షలు.. ALL THE BEST

image

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 35,562 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఫస్టియర్ 17.799, సెకండియర్‌లో 17763 మంది విద్యార్థులు రాయనుండగా.. 58 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో BNS 163(144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒక నిమిషం ఆలస్యాన్ని తాజాగా 5 నిమిషాలకు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ALL THE BEST

Similar News

News April 23, 2025

KNR: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

తిమ్మాపూర్‌లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మే 5 నుంచి మగ్గం వర్క్స్, మే 8 నుంచి టైలరింగ్ పై ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ. సంపత్ తెలిపారు. ఉమ్మడి KNR జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు 18 నుంచి 45 సంవత్సరాల వారు అర్హులు అవుతారని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు మే 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ శిక్షణ 31 రోజులు ఉంటుందని అన్నారు.

News April 22, 2025

ఇంటర్ ఫలితాల్లో అల్ఫోర్స్ ప్రభంజనం

image

ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ అల్ఫోర్స్ జూనియర్ కాలేజీ ప్రభంజనం సృష్టించిందని అల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ వి.నరేందరెడ్డి తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం MPC విభాగంలో S.లహరి 468, హప్సహస్నాన్ 468, తహూరా నూర్ 468 మార్కులు సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో K.రుత్విక్ 996, శ్రీనిత్యరెడ్డి 995, రుత్విక 995 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో సత్తాచాటారని ఆయన ప్రకటించారు.

News April 22, 2025

ఇల్లందకుంట ఆలయ ఆదాయ వివరాలు

image

ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో 2025 శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల హుండీ లెక్కింపు మంగళవారం ఉదయం 9గంటలకు జరిగింది. ఈ సందర్భంగా రూ.20,69,829 నగదు, 12గ్రా. బంగారం, 305గ్రా. వెండి, 225 డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీ లభించాయి. ఈసారి గతేడాదితో పోలిస్తే రూ.2.94 లక్షలు అధికంగా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

error: Content is protected !!