News March 5, 2025

కరీంనగర్: నేడే పరీక్షలు.. ALL THE BEST

image

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 35,562 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఫస్టియర్ 17.799, సెకండియర్‌లో 17763 మంది విద్యార్థులు రాయనుండగా.. 58 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో BNS 163(144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒక నిమిషం ఆలస్యాన్ని తాజాగా 5 నిమిషాలకు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ALL THE BEST

Similar News

News March 27, 2025

కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

image

కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 40.0°C నమోదు కాగా, జమ్మికుంట 39.7, తిమ్మాపూర్ 39.6, మానకొండూర్, కరీంనగర్ 39.3, చిగురుమామిడి 39.2, వీణవంక, రామడుగు 38.8, సైదాపూర్ 38.7, శంకరపట్నం, గన్నేరువరం 38.4, హుజూరాబాద్ 38.2, కొత్తపల్లి 38.1, కరీంనగర్ రూరల్ 37.9, ఇల్లందకుంట 37.7, చొప్పదండి 37.6°C గా నమోదైంది.

News March 27, 2025

సైదాపూర్ : ట్రాక్టర్ కిందపడి వ్యక్తి దుర్మరణం

image

ట్రాక్టర్ కిందపడి వ్యక్తి మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సోమారం ఆదర్శ పాఠశాల సమీపంలో చోటు చేసుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున మక్కల లోడుతో సైదాపూర్ నుంచి శంకరపట్నం వైపు వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ దాని కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. రైతులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News March 27, 2025

సైదాపూర్: తాడిచెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

image

తాడిచెట్టు పై నుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన సైదాపూర్ మండలం ఘనపూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. ఘనపూర్ గ్రామానికి చెందిన ఆకుల కనుకయ్య (53) అనే గీతకార్మికుడు తాటికల్లు తీయడానికి రోజూలాగే చెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తు జారిపడి అక్కడిక్కడకే మృతి చెందాడు. కనకయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!