News October 8, 2024

కరీంనగర్: నేడే ‘సద్దుల బతుకమ్మ’

image

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాధారణంగా తొమ్మది రోజులకు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ సహా.. పలు ప్రాంతాల్లో మాత్రం ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఇక్కడి ఇంటి బిడ్డలు, కోడళ్లు.. 7, 9 రోజులకు రెండు సార్లూ సద్దుల బతుకమ్మలో పాల్గొంటారు. మరి మీ ప్రాంతంలో సద్దుల బతుకమ్మ ఎప్పుడో కామెంట్ చేయండి.

Similar News

News October 8, 2024

జగిత్యాల: ఉపాధి కల్పనకు కసరత్తు

image

ఉపాధిహామీ పథకం కింద గ్రామీణ కూలీలకు చేతినిండా పని కల్పించడానికి జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను గుర్తించారు. వచ్చే నెలలో మండలాల వారిగా ప్రణాళికలు ఖరారు చేయనున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా 1.67 లక్షల జాబ్ కార్డుల పరిధిలో 2.73 లక్షల మంది కూలీలు ఉన్నారు.

News October 8, 2024

సిరిసిల్ల: పత్తి కొనుగోలు కేంద్రాలకు మౌలిక వసతుల కల్పన

image

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో వచ్చే పత్తి పంటను మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ కలెక్టరేట్‌లో పత్తి కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో పత్తి కొనుగోలు యాక్షన్ ప్లాన్‌ను అధికారులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు.

News October 8, 2024

పెద్దపల్లి: రైల్వే అధికారులకు వినతిపత్రం అందజేసిన ఎంపీ

image

పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, ఓదెల రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, రెచ్నిలలో కొత్త రైళ్ల ప్రారంభం, పాత రైళ్ల పునరుద్ధరణ అభివృద్ధి కోసం నేడు పెద్దపెల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి రైల్వే అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన రైల్వే ప్రయాణం అందించడం కొరకు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.