News October 8, 2024

కరీంనగర్: నేడే ‘సద్దుల బతుకమ్మ’

image

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాధారణంగా తొమ్మది రోజులకు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ సహా.. పలు ప్రాంతాల్లో మాత్రం ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఇక్కడి ఇంటి బిడ్డలు, కోడళ్లు.. 7, 9 రోజులకు రెండు సార్లూ సద్దుల బతుకమ్మలో పాల్గొంటారు. మరి మీ ప్రాంతంలో సద్దుల బతుకమ్మ ఎప్పుడో కామెంట్ చేయండి.

Similar News

News December 11, 2025

కరీంనగర్: నేడే 92 గ్రామాల్లో పోలింగ్.. రెడీనా?

image

కరీంనగర్ జిల్లాలో తొలివిడతలో 5 మండలాలకు పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. చొప్పదండి (16), రామడుగు (23), గంగాధర(33), కొత్తపల్లి (6), కరీంనగర్ గ్రామీణ(14) లలో జరగనున్నాయి. మొత్తం 92 గ్రామాలు ఉన్నాయి. ఎన్నికలలో ఎలాంటి ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ఉ. 7 నుంచి మ. 1గంట వరకు జరగనుండగా.. మ. 2గంటల నుంచి నుంచి ఫలితాలు వెల్లడికానున్నాయి. మరి ఓటేసేందుకు రెడీనా?

News December 11, 2025

కరీంనగర్: ఈనెల 21న ప్రత్యేక లోక్ అదాలత్

image

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఈనెల 21న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు అదనపు సీనియర్ సివిల్ జడ్జ్, ఇన్‌ఛార్జ్ కార్యదర్శి కే.రాణి ఒక ప్రకటనలో తెలిపారు. క్రిమినల్, సివిల్, బ్యాంకు, చెక్ బౌన్స్ కేసులు సహా వివిధ కేసులు పరిష్కరించేందుకు ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.