News October 16, 2024

కరీంనగర్: పంచాయతీ ఎన్నికల బరిలో యువత!

image

ఇప్పటి వరకు రాజకీయాలంటే ఆసక్తి చూపని యువత ధోరణిలో మార్పు కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 1,226 పంచాయతీల్లో ప్రధానంగా యువత బరిలో ఉండేందుకు ఆసక్తి చూపుతోంది. రోజూ గ్రామంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తూ.. ప్రజల్లో గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గ్రామంలోని ముఖ్య నాయకులను కలుస్తూ వారి ఆశీస్సులు తీసుకునేలా కసరత్తు చేస్తున్నారు. మరి మీ దగ్గర యువత బరిలో ఉంటుందా? కామెంట్.

Similar News

News November 13, 2024

గ్రూప్-3 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి: KNR కలెక్టర్ 

image

ఈనెల 17, 18వ తేదీల్లో జిల్లాలో గ్రూప్-3 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గ్రూప్-3 పరీక్షకు విధులు కేటాయించిన అధికారులకు బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అభ్యర్థులు నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

News November 13, 2024

రైలు ప్రమాద నేపథ్యంలో రైళ్లను దారి మళ్లింపు

image

గూడ్స్ రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించింది. రాఘవాపూర్ – రామగుండం మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైల్వే శాఖ పలు రైళ్లను నిజామాబాద్ మీదుగా మళ్లిస్తూ నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్, సికింద్రాబాద్ రైళ్లను రద్దు చేయగా, మధురై, నిజాముద్దీన్, చెన్నై సెంట్రల్ – లక్నో, పలు రైళ్ల దారి మళ్లించారు.

News November 13, 2024

పెద్దపల్లి: ముమ్మరంగా కొనసాగుతున్న రైల్వే ట్రాక్ పనులు

image

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు బోగీలు తొలగించడంతో పాటు ట్రాక్‌పై మరమ్మతు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పెద్దపెల్లి జిల్లా రాఘవపూర్ కన్నాల మధ్యలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు భారీ జేసీబీలు తెప్పించే మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఇప్పటివరకు మెయిన్ లైన్ రైల్వే ట్రాక్ 600 మీటర్ల వరకు పైగా పూర్తిగా తొలగించినట్లు సమాచారం.