News March 4, 2025

కరీంనగర్: పట్టభద్రుల ఎన్నిక కౌంటింగ్ అప్డేట్

image

కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నికలో ఇప్పటివరకు 2 లక్షల 10 వేల ఓట్లను లెక్కించినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో సుమారు 21 వేల ఓట్లు చెల్లుబాటు కాలేదన్నారు. సుమారు ఒక లక్ష 89 వేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయని ఇంకా 40 వేల ఓట్లు ప్రాథమిక లెక్కింపు విభజన చేయాల్సి ఉందన్నారు. మంగళవారంఉదయం 10 గంటల నుంచి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ చేయనున్నట్లు తెలిపారు.

Similar News

News October 26, 2025

జిల్లాస్థాయి చెస్ పోటీలకు తాడిపత్రి విద్యార్థి ఎంపిక

image

జిల్లా స్థాయి చెస్ పోటీలకు తాడిపత్రి విద్యార్థి లిఖిలేశ్వర్ రావు ఎంపికైనట్లు కోచ్ పవన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణంలోని జూనియర్ కళాశాలలో జరిగిన మండల స్థాయి చెస్ పోటీలలో అండర్ -17 విభాగంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి లిఖిలేశ్వర్ రావు ప్రతిభ కనబరిచి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. ఎంపికైన విద్యార్థిని అధ్యాపక బృందం, కోచ్ పవన్ కుమార్ రెడ్డి అభినందించారు.

News October 26, 2025

శుభ సమయం (26-10-2025) ఆదివారం

image

✒ తిథి: శుక్ల పంచమి రా.12.46 వరకు
✒ నక్షత్రం: జ్యేష్ట ఉ.8.18
✒ శుభ సమయాలు: ఉ.8.30-9.00, మ.3.00-3.30
✒ రాహుకాలం: సా.4.30-6.00
✒ యమగండం: మ.12.00-మ.1.30
✒ దుర్ముహూర్తం: సా.4.25-5.13, వర్జ్యం: సా.5.02-6.47
✒ అమృత ఘడియలు: రా.3.28-తె.5.12
✍️ రోజువారీ పంచాంగం, రాశి ఫలాలు కోసం <<-se_10009>>క్లిక్<<>> చేయండి.

News October 26, 2025

సోమవారం ఎస్పీ ఆఫీసులో పీజీఆర్ఎస్ రద్దు: ఎస్పీ

image

రాయచోటిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ నెల 27న జరగనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక (PGRS) కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు శనివారం రాత్రి జిల్లా ఎస్పీ కార్యాలయ అధికారులు ప్రకటించారు. జిల్లాకు ఈనెల 26 నుంచి 29 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురస్తాయని వాతావరణశాఖ ప్రకటించడంతో అప్రమత్తమై పీజీఆర్ఎస్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.