News March 6, 2025
కరీంనగర్: పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: కవిత

కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని BRS ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, పార్టీలపరంగా, సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయన్నారు. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి హరికృష్ణ గెలవలేదని ఆమె అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు.
Similar News
News October 21, 2025
మానకొండూరు: ఎస్సై సంజీవ్ త్యాగం స్ఫూర్తిదాయకం..!

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం మానకొండూరులోని ఎస్సై సంజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తుపాకులగూడెంలో జరిగిన ఎన్కౌంటర్లో సంజీవ్ నక్సల్తో వీరోచితంగా పోరాడి అమరుడయ్యారని సీపీ గుర్తుచేశారు. పోలీస్ అమరుల త్యాగాలను స్మరించుకోవాలని, వారి నిబద్ధతను, ధైర్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సీపీ ఈ సందర్భంగా సూచించారు.
News October 19, 2025
KNR: దీపావళి.. ఈ నంబర్లు SAVE చేసుకోండి..!

కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకోవాలని CP గౌష్ ఆలం సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, ప్రజలు తక్షణ సాయం కోసం వెంటనే కింది నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. పోలీస్ కంట్రోల్ రూం(PCR) 100, ఫైర్ కంట్రోల్ రూం 101, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్(ERSS) 112 నంబర్లను సంప్రదించాలన్నారు. సేవలు అందించడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారన్నారు.
News October 19, 2025
KNR: ‘పెద్దల సమక్షంలోనే క్రాకర్స్ పేల్చాలి’

దీపావళి పండుగను సురక్షితంగా, ప్రశాంతంగా, ప్రమాదరహితంగా జరుపుకోవాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం సూచించారు. ప్రజలు సమగ్ర భద్రతా నియమాలు పాటిస్తూ అగ్ని ప్రమాదాలు, గాయాలు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రిస్తూ బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా జరుపుకోవాలని ఆయన కోరారు. చిన్నపిల్లలు పెద్దల సమక్షంలోనే టపాసులు పేల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.