News March 6, 2025
కరీంనగర్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎవరికి ఎన్ని ఓట్లంటే..?

ఉమ్మడి కరీంనగర్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ నుంచి పోటీ చేసిన అంజిరెడ్డి 98,637 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నరేందర్ రెడ్డికి 93,531 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ నుంచి పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణకు 63,972 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 23, 2026
NZB: మార్కెట్ కమిటీల సమస్యలు పరిష్కరించాలని వినతి

తెలంగాణ రాష్ట్ర మార్కెట్ కమిటీ ఛైర్మన్ల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ ముఖ్య సలహాదారు నరేందర్ రెడ్డికి మార్కెట్ కమిటీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫోరం అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి వినతిపత్రం అందజేశారు. మార్కెట్ కమిటీల్లో పని చేస్తున్న సిబ్బందికి వేతనాలు అందకపోవడం, యార్డుల అభివృద్ధి పనులు మంజూరులో జాప్యం, ఛైర్మన్ గౌరవ వేతనాలు అందకపోవడం వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.
News February 23, 2026
నిజామాబాద్: పసుపు రైతులకు ముఖ్య గమనిక

అకాల వర్షాల కారణంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు పసుపు రైతులకు పలు సూచనలు చేశారు. మంగళవారం పసుపు వ్యాపార లావాదేవీలు మూసివేయనున్నట్లు తెలిపారు. యార్డులో సరైన స్థలం లేకపోవడంతో మంగళవారం పసుపు రైతులు ఎవరూ తీసుకురావద్దని సూచించారు. బుధవారం నుంచి కనుగొళ్లు యథావిధిగా ఉంటాయన్నారు.
News February 23, 2026
పుష్కరాలకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయండి: శైలజా రామయ్యర్

రాబోయే గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ సోమవారం సమీక్షించారు. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె.. పుష్కరాల ఏర్పాట్లపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఘాట్లు, తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.


