News March 6, 2025

కరీంనగర్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎవరికి ఎన్ని ఓట్లంటే..?

image

ఉమ్మడి కరీంనగర్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ నుంచి పోటీ చేసిన అంజిరెడ్డి 98,637 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నరేందర్ రెడ్డికి 93,531 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ నుంచి పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణకు 63,972 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News March 15, 2025

SRH అభిమానులకు గుడ్ న్యూస్

image

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి యోయో టెస్టు పాసయ్యారు. బెంగళూరులోని NCAలో నిర్వహించిన ఈ పరీక్షలో నితీశ్ 18.1 పాయింట్లు సాధించారు. దీంతో ఆయన రేపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరతారు. కాగా ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆయన గాయపడ్డారు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పక్కటెముకల గాయానికి గురయ్యారు. అప్పటినుంచి ఎన్సీఏలో పునరావాసం పొందుతున్నారు.

News March 15, 2025

తణుకు: పారిశుద్ధ్య కార్మికులతో సీఎం చంద్రబాబు ఫొటో

image

తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. చెత్త నుంచి సంపద సృష్టించి, స్వచ్ఛాంధ్ర కల సాకారం చేసుకోవడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆయన పరిసరాలను పరిశుభ్రం చేసి వారితో కలిసి ఫోటో దిగారు. ఈ పిక్‌ను టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి.

News March 15, 2025

కడెం: గ్రూప్-3 ఫలితాల్లో మెరిసిన తండా యువకుడు

image

గ్రూప్-3 ఫలితాల్లో కడెం మండలంలోని చిన్న బెల్లాల్ తండాకు చెందిన భుక్యా శశికుమార్ ప్రతిభ కనబరిచాడు. 306 మార్కులు సాధించి ఎస్టీ కోటాలో రాష్ట్రస్థాయి ఫస్ట్ ర్యాంక్, జనరల్ కోటాలో 58వ ర్యాంకు సాధించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన యమున-కిషన్ దంపతుల కుమారుడు శశికుమార్ గ్రూప్-1 సాధించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. గ్రూప్-3లో ప్రతిభ కనబరిచిన శశి కుమార్‌ను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.

error: Content is protected !!