News February 28, 2025

కరీంనగర్: పట్టభద్రుల పోలింగ్ 70.42% టీచర్స్ పోలింగ్ 91.90%

image

పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫైనల్ పోలింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ 70.42 శాతం అయినట్లు పేర్కొన్నారు. అలాగే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ 91.90 శాతం నమోదైనట్లు వెల్లడించారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు తెలిపారు.

Similar News

News November 15, 2025

ఆర్జేడీ భంగపాటుకు ప్రధాన కారణం కాంగ్రెస్ బలహీనతే!

image

బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడమే బిహార్‌లో ఆర్జేడీ ఓటమికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక సమస్యలను పక్కనపెట్టి ఓట్ చోరీ ఆరోపణలపై ఎక్కువగా దృష్టిపెట్టడం కూడా మహాగఠ్‌బంధన్ కొంపముంచిందని చెబుతున్నారు. బలహీన కాంగ్రెస్ ఆర్జేడీకి భారమైందని, సంప్రదాయ ఓటు బ్యాంకును నమ్ముకోవడమూ ఓటమికి కారణమని అంటున్నారు. గత ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది.

News November 15, 2025

గ్లోబల్‌ ఫెరారీ రేసింగ్‌‌లో తొలి భారతీయ మహిళ

image

చిన్నప్పుడు అందరు పిల్లలు కార్టూన్లు చూస్తుంటే డయానా పండోలె మాత్రం రేసింగ్‌ చూసేది. అలా పెరిగిన ఆమె ఇండియన్‌ నేషనల్‌ కార్‌ రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌ని గెలుచుకొన్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లైనా పలు రేసుల్లో ఛాంపియన్‌గా నిలుస్తోంది. త్వరలో గ్లోబల్‌ ఫెరారీ రేసింగ్‌ సిరీస్‌‌లో పాల్గొని మొదటి భారతీయ మహిళగా రికార్డు సృష్టిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

News November 15, 2025

WGL: వరుస రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి

image

ఉమ్మడి WGL జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. భూపాలపల్లి జిల్లాలో రాజయ్య బైక్ ప్రమాదంలో మృతి చెందాడు. రఘునాథపల్లి వద్ద గూడ్స్ వాహనం ఢీకొనగా రాపాక వినోద్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. దుగ్గొండి దగ్గర గృహప్రవేశానికి వెళ్తున్న హనుమాయమ్మ లారీ ఢీకొనడంతో మృతి చెందింది. మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు సహా గాయపడ్డారు.