News March 23, 2025

కరీంనగర్: పదో తరగతి పరీక్షలు.. 14 మంది గైర్హాజరు

image

శనివారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 14 మంది గైర్హాజరయ్యారు. 12,491 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అదేవిధంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కరీంనగర్ నగరంలోని పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Similar News

News November 20, 2025

హనుమాన్ నగర్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి

image

కరీంనగర్‌లోని హనుమాన్ నగర్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చుట్టుపక్కల వారికి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతుడిని కోహెడ మండలం కూరెళ్ల గ్రామానికి చెందిన బాలరాజుగా గుర్తించారు. మేస్త్రీ పని చేసుకుంటూ కొంతకాలంగా ఒంటరిగా కిరాయి ఉంటున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News November 20, 2025

KNR: మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

సీఎం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కరీంనగర్ జిల్లా, మండల మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులతో కలెక్టర్ పమోల సత్పతి సమావేశమయ్యారు. ఇందిరమ్మ చీరలు ప్రతి ఒక్కరికీ అందేలా పర్యవేక్షించాలని ఆమె సూచించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మంజూరైన యూనిట్లతో వ్యాపారాలు ప్రారంభించిన మహిళా సంఘాలు, కృషి, పట్టుదలతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.