News May 12, 2024
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 2,194 పోలింగ్ స్టేషన్లు

కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,194 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. వీటిలో ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. 17,97,000 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుషుల కంటే మహిళలు 40,000 మంది అధికంగా ఉన్నారని వివరించారు. 42 వేల మంది దివ్యాంగులు ఉన్నారని, వయోవృద్ధులు 13200 మంది ఉన్నారని తెలిపారు.
Similar News
News February 18, 2025
కరీంనగర్: వ్యక్తిపై కొడవలితో దాడి.. తీవ్ర గాయాలు

హత్యాయత్నం చేసిన దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన బత్తిని సాగర్ పై అదే గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి భూసంబంధిత విషయంలో కొడవలితో దాడి చేయగా సాగర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 18, 2025
కరీంనగర్: కాలువలో దూకి యువతి ఆత్మహత్యాయత్నం

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కాకతీయ కెనాల్ కాలువలోకి దూకి సోమవారం ఓ యువతి ఆత్మహత్యకు యత్నించిందని స్థానికులు తెలిపారు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి కాలువలో దూకి ఆ యువతిని కాపాడామన్నారు. ఆత్మహత్య యత్నించిన ఆమె కరీంనగర్‌లోని శ్రీనగర్ కాలనీకి చెందిన యువతికి గుర్తించామని తెలిపారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి తీసుకెళ్లారన్నారు.
News February 18, 2025
చొప్పదండి: విండోను సందర్శించిన హిమాచల్ ప్రదేశ్ బృందం

చొప్పదండి సింగిల్ విండోను సోమవారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల అధ్యక్షుడు, అధికారుల బృందం సందర్శించింది. సొసైటీ పనితీరు, రైతులకు అందించే సేవలను పాలకవర్గం వారికి వివరించింది. సొసైటీ సభ్యులకు 10 శాతం డివిడెండ్ అందిస్తున్నామని, రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించామని తెలిపారు. వ్యవసాయ రుణాల రికవరీ 100 శాతం చేశామని, ఇతరు రుణాలు 85 శాతం వరకు రికవరీ చేశామని చెప్పారు.