News July 13, 2024

కరీంనగర్: పెరగనున్న భూముల ధరలు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూముల ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువ పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. KNR రూరల్ మండలంలోని ఓ రైతు ఇటీవల రెండెకరాల భూమిని కొనుగోలు చేశాడు. అతడికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.42 వేలకు పైగా ఖర్చయింది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువ పెరిగితే కనీసం రూ.60 వేలు ఖర్చవుతుంది. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి.

Similar News

News December 2, 2025

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, కొత్తపల్లి గ్రామపంచాయతి లలో రెండవ విడత నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఆమె వెంట జిల్లా అధికారులు సిబ్బంది ఉన్నారు.

జీటీఏ కరీంనగర్ నూతన అధ్యక్షుడిగా రవీందర్ ఎన్నిక

image

ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (GTA) కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షుడిగా గాజుల రవీందర్, ప్రధాన కార్యదర్శినిగా చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయడంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటామన్నారు. భవిష్యత్తులో సంఘం నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు హార్ధికంగా, ఆర్థికంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల బాధ్యులు పాల్గొన్నారు.