News July 31, 2024
కరీంనగర్: పెరుగుతున్న డెంగీ కేసులు!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. కొద్దిరోజుల పాటు కురిసిన వర్షాలకు ఖాళీ స్థలాల్లో నీరు నిలిచి దోమలు విజృంభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో సాధారణ జ్వరాలతో పాటు వైరల్ జ్వరాలు సైతం ప్రబలుతున్నాయి. జనవరి నుంచి జులై వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 190 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువ కేసులు కరీంనగర్, జగిత్యాలలోనే ఉన్నాయి.
Similar News
News July 5, 2025
చొప్పదండి: తైక్వాండో ఛాంపియన్లను అభినందించిన కేంద్రమంత్రి

చొప్పదండి పట్టణానికి చెందిన తైక్వాండో ఛాంపియన్లను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం అభినందించారు. జూన్ 23 నుంచి 25వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. పడకంటి కాశీ విశ్వనాద్, భూసారపు వెంకటేష్ గౌడ్, స్పందన, సౌమ్య, రామ్ చరణ్ అనే విద్యార్థులు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ఏడు గోల్డ్, ఒకటి సిల్వర్, ఒకటి రజిత పథకాలు సాధించారు.
News July 4, 2025
బహిరంగ ప్రదేశాల్లో నిషేధాజ్ఞలు: KNR సీపీ

సాధారణ పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని KNR కమీషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను ఈ నెల 31 వరకు పొడిగించినట్లు KNR CP గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఘర్షనలకు పాల్పడుతున్న మందుబాబులపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించినట్లు సీపీ పేర్కొన్నారు.
News July 4, 2025
KNR: కలెక్టరేట్‌లో ఘనంగా రోశయ్య జయంతి

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య జయంతిని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రోశయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పూలమాలవేసి నివాళులు అర్పించారు. దేశ చరిత్రలో ఏడుసార్లు వరుసగా ఏపీ ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోశయ్య తమిళనాడు గవర్నర్ గా, ఏపీ సీఎంగా గొప్ప సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.