News July 22, 2024

కరీంనగర్: పెరుగుతున్న సాగు విస్తీర్ణం!

image

ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగువిస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండంతో రైతులు వరి నాట్ల జోరు పెంచారు. అలాగే ఇప్పటి వరకు 1.55 లక్షల ఎకరాల్లో పత్తిని విత్తుకోగా ఈ నెలాఖరు వరకు 1.90 లక్షల ఎకరాలకు సాగు పెరగనుంది అని అధికారులు అంచన వేస్తున్నారు. పలు రకాల పంటల సాగుకు మరో 10 – 15 రోజులు ఉండటంతో సాగు విస్తీర్ణం పెరగనుంది.

Similar News

News September 18, 2025

KNR: చేతిరాత చాలా ముఖ్యమైంది: కలెక్టర్

image

కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం రాత్రి జిల్లా స్థాయి చేతిరాత విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి హాజరై మాట్లాడారు. హ్యాండ్ రైటింగ్ జీవితంలో చాలా ముఖ్యమైందని, దీనిని ఇంప్రూవ్ చేసుకోవాలని సూచించారు. చేతిరాత అంటే మైండ్ రైటింగ్ అని, మేధస్సుకు పదును పెట్టి మనిషి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.

News September 18, 2025

KNR: జిల్లాస్థాయి “కళోత్సవ్” పోటీల్లో కలెక్టర్

image

KNR జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కళోత్సవ్ పోటీలను కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ కళా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. సంగీతం, నృత్యం, కథ, దృశ్య కళలు వంటి 12కేటగిరీల్లో పోటీలు జరుగుతున్నాయన్నారు. మండలస్థాయి పోటీల్లో గెలుపొందిన వారికి బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాస్థాయి పోటీలు ప్రారంభించారు.

News September 18, 2025

KNR: నేటి నుంచి సదరం క్యాంపులు

image

కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆధ్వర్యంలో నేటి నుంచి 24వ తేదీ వరకు సదరం క్యాంపులు జరగనున్నాయని జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దివ్యాంగులు మీసేవ కేంద్రాల ద్వారా తమ పేరును నమోదు చేసుకొని, కేటాయించిన తేదీల్లో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో హాజరుకావాలని కోరారు. మొత్తం 676 మందికి ఈ క్యాంపుల్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.