News March 7, 2025
కరీంనగర్: పెళ్లి ఊరేగింపులో విషాదం.. మహిళ మృతి..UPDATE

కరీంనగర్ జిల్లాలో ఓ పెళ్లి ఊరేగింపులో కారు బీభత్సం సృష్టించగా పలువురు గాయపడ్డారు. శంకరపట్నం మండలం మెట్టుపల్లిలో జరిగిన ఈ ఘటనలో గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనలో బాకారపు ఉమ అనే మహిళ తీవ్రంగా గాయపడగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. ఈ కారు బీభత్సంతో గ్రామంలో దాదాపు 20 కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 20, 2025
KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 38.9°C నమోదు కాగా, జమ్మికుంట 38.7, చిగురుమామిడి 38.2, శంకరపట్నం 38.0, కరీంనగర్ రూరల్ 37.9, గన్నేరువరం 37.7, మానకొండూర్ 37.6, తిమ్మాపూర్ 37.3, వీణవంక 37.2, రామడుగు 37.0, కరీంనగర్ 36.7, కొత్తపల్లి 36.0, హుజూరాబాద్ 35.5, ఇల్లందకుంట 35.4, చొప్పదండి 35.0, సైదాపూర్ 34.6°C గా నమోదైంది.
News March 20, 2025
జగిత్యాల: ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు.. పురుగు మందు తాగి ఆత్మహత్య

జగిత్యాల జిల్లాలో ఓ బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు, బాలుడు వేధించగా ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రవికిరణ్ వివరాల ప్రకారం.. పెగడపల్లి మండలం రామభద్రునిపల్లికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన రాము అనే యువకుడు, రంగదామునిపల్లికి చెందిన మరో బాలుడు ప్రేమ పేరుతో వేధించారు. అది భరించలేక ఈనెల 15న బాలిక పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.
News March 20, 2025
బడ్జెట్.. ఉమ్మడి కరీంనగర్‌కు కేటాయింపులు ఇలా..

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో KNR స్మార్ట్ సిటీ పనులకోసం రూ.179కోట్లు కేటాయించింది. అదేవిధంగా SUకి రూ.35కోట్లు, స్పోర్ట్స్ స్కూల్‌కు రూ.21కోట్లు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు రూ.349.66కోట్లు, వరదకాలువల పనులకు 299.16కోట్లు, కాళేశ్వరం రూ.2,685కోట్లు, మానేరు ప్రాజెక్ట్‌కు రూ.లక్ష, బొగ్గులవాగు(మంథని)రూ.34లక్షలు, రామడుగు, గోదావరి బేసిన్‌కు రూ.2.23కోట్లను కేటాయించింది.