News February 24, 2025
కరీంనగర్: పోలింగ్ సందర్భంగా ప్రచారం నిషేధం: కలెక్టర్

ఈ నెల 27న జరిగే MDK, NZB, KNR, ALD పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి అమలులో ఉంటుందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటన లో తెలిపారు. సైలెన్స్ పీరియడ్ లో భాగంగా ఈ నెల 25 సాయంత్రం 4.00 నుండి ఈ నెల 27 సాయంత్రం 4.00 వరకు బహిరంగ సభలు, ఊరేగింపులు సమావేశాలు నిర్వహించడం, ప్రచారం చేయడం, బల్క్ ఎస్ఎంఎస్ పంపడంపై నిషేధం అని తెలిపారు.
Similar News
News March 26, 2025
KNR: జపాన్-ఆసియా యువ విజ్ఞాన మార్పిడి కార్యక్రమానికి యువ ఆవిష్కర్త ఎంపిక

కరీంనగర్‌కు చెందిన యువ ఆవిష్కర్త శుభ శ్రీ సాహు ఓ ప్రవేట్ పాఠశాలలో చదువుతున్నప్పుడు రైతులకోసం ఒక వినూత్న వ్యవసాయ యంత్రాన్ని రూపొందించారు. ఇటీవల ఆ ప్రాజెక్టు రూపొందించిన శుభ శ్రీ జపాన్౼ఆసియా యువ విజ్ఞాన మార్పిడి కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శుభ శ్రీ ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పాఠశాల ఛైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు.
News March 26, 2025
KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలు..

KNR జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా తిమ్మాపూర్ మండలంలో 39.6°C నమోదు కాగా, గంగాధర 39.5, మానకొండూర్ 39.4, జమ్మికుంట 39.3, ఇల్లందకుంట 39.0, కరీంనగర్ 38.9, రామడుగు, చిగురుమామిడి 38.7, శంకరపట్నం 38.4, గన్నేరువరం 38.0, వీణవంక 37.7, కొత్తపల్లి 37.6, కరీంనగర్ రూరల్ 37.3, చొప్పదండి 37.0, హుజూరాబాద్ 36.8, సైదాపూర్ 35.5°C గా నమోదైంది.
News March 26, 2025
KNR: ఉచిత e-Auto డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్ ఎల్ఎండి కాలనీలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళలకు ఉచిత e-Auto డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా డైరెక్టర్ వి.సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 45 సం.ల లోపు 50 మంది నిరుపేద గ్రామీణ SC, ST, BC & MINORITY మహిళలకు 45 నుంచి 60 రోజుల పాటు శిక్షణ ఇస్తామని అన్నారు. ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవచ్చు, వివరాలకు పని దినాల్లో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.