News February 24, 2025
కరీంనగర్: పోలింగ్ సిబ్బంది రెఢీ

KNR, MDK, NJB, ADB ఉమ్మడి జిల్లా పరిధిలో పట్టభద్రుల ఓటర్లు 3,55,159 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 27,088 మంది ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం మైక్రో అబ్జర్వర్లు 394, జోనల్ అధికారులు 335, పోలింగ్ అధికారులు 2,606, ప్రిసైడింగ్ అధికారులు 864 మందిని నియమించారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు 680 ఏర్పాటు చేయగా, కామన్ పోలింగ్ స్టేషన్లు 93, పట్టభద్రుల పోలింగ్ స్టేషన్లు 406, ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాలు 181 ఏర్పాటు చేశారు.
Similar News
News February 25, 2025
ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

✓ గుడ్ న్యూస్…రేపు ఖమ్మంలో జాబ్ మేళా✓ ఏన్కూరు: వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు✓ మధిర:డిప్యూటీ సీఎం పీఏ శ్రీనివాస్ గుండెపోటుతో మృతి✓ఖమ్మం నారాయణ కాలేజ్ వద్ద పీడీఎస్యూ ఆందోళన✓ కల్లూరు: తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు✓ ఖమ్మం: మత సామరస్యానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి: సీపీ✓ఖమ్మం: ప్రజావాణిలో వినతులు స్వీకరించిన కేఎంసీ కమిషనర్✓ స్టూడెంట్‌గా మారిన ఖమ్మం జిల్లా కలెక్టర్
News February 25, 2025
మేడ్చల్: టీచర్లకు కలెక్టర్ కీలక సూచనలు..

పదవ తరగతి తరువాత ఏ దిశగా వెళ్లాలనే అంశాలపై విద్యార్థులకు క్షుణ్ణంగా అర్థమయ్యేలా మార్గనిర్దేశం చేసి వారి భవిష్యత్తుకు చేయూతనందించేలా అన్ని పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం సూచించారు. సోమవారం కూకట్‌పల్లి మండలం ఎల్లమ్మబండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయనతో పాటు సంబంధిత అధికారులు ఉన్నారు.
News February 25, 2025
రావణ, మయూరి వాహనంపై దర్శనమిచ్చిన కైలాసనాధుడు

శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాల్లో సందర్బంగా 4వ రోజు సోమవారం రాత్రి శ్రీకాళహస్తీశ్వరుడి రావణ, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు మయూరి వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో, ఆభరణాలతో సుందరంగా అలంకరించి, ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పట్టణ పురవీధుల్లో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కర్పూర నీరాజనాలు పట్టారు.