News March 24, 2025

కరీంనగర్: ప్రజావాణిలో సాంకేతిక సమస్య.. ఇబ్బంది పడ్డ అర్జీదారులు

image

కరీంనగర్ కలెక్టర్ ప్రజావాణిలో సర్వర్ సమస్య తలెత్తడంతో అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ సమస్యలను విన్నవించేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. అయితే, సర్వర్‌లో సాంకేతిక సమస్య వల్ల కాస్త ఆలస్యం అయింది. అర్జీదారులు అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు ఎండ వేడిమి ఉండడతో కనీసం నీళ్ల సౌకర్యాలు కూడా కల్పించలేదని వాపోయారు. చివరకు సర్వర్ ప్రాబ్లం క్లియర్ అవడంతో అధికారులు అర్జీలు స్వీకరించారు.

Similar News

News December 9, 2025

KNR కమిషనరేట్‌లో 19 శాతం సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు

image

కరీంనగర్ జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. కమిషనరేట్‌లో 19 శాతం సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి, అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మొత్తం 104 క్లస్టర్లలో పెట్రోలింగ్‌తో పాటు, ఏసీపీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

News December 9, 2025

‘ఐదుగురు, అంతకంటే ఎక్కువమంది గుమికూడొద్దు’

image

కరీంనగర్ తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు CP గౌష్ ఆలం తెలిపారు. రూరల్ డివిజన్‌లోని ఐదు మండలాల్లో BNSS సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించామన్నారు. ఈ ఉత్తర్వులు ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి DEC 11 రాత్రి 11:59 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడటంపై పూర్తి నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు.

News December 9, 2025

చొప్పదండి: నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహణపై శిక్షణ కార్యక్రమం

image

చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఈనెల 13న జరగనున్న దృష్ట్యా, నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్(పరీక్షలు) సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాల నిర్వహణ అధికారులు పాల్గొన్నారు. పరీక్ష నిర్వహణపై విధి విధానాలు చర్చించి, సామగ్రిని నిర్వాహకులకు అందజేశారు. ఇన్చార్జి ప్రిన్సిపల్ బ్రహ్మానందరెడ్డి, ఎంఈఓ మోహన్ పాల్గొన్నారు