News February 12, 2025

కరీంనగర్: ప్రభుత్వ ఆసరా అందేనా?

image

ఆసరా పింఛన్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచినా కొత్త పింఛన్లపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అర్హులైన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత BRS ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం 57 ఏళ్లకు ఆసరా పెన్షన్లు ఇస్తుందో.. లేదో అని ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

Similar News

News December 2, 2025

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, కొత్తపల్లి గ్రామపంచాయతి లలో రెండవ విడత నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఆమె వెంట జిల్లా అధికారులు సిబ్బంది ఉన్నారు.

జీటీఏ కరీంనగర్ నూతన అధ్యక్షుడిగా రవీందర్ ఎన్నిక

image

ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (GTA) కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షుడిగా గాజుల రవీందర్, ప్రధాన కార్యదర్శినిగా చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయడంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటామన్నారు. భవిష్యత్తులో సంఘం నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు హార్ధికంగా, ఆర్థికంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల బాధ్యులు పాల్గొన్నారు.