News October 26, 2024
కరీంనగర్: ప్రభుత్వ ఆసరా అందేనా!
ఆసరా పింఛన్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 10 నెలలు గడుస్తున్నా కొత్త పింఛన్లపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అర్హులైన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత BRS ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం 57 ఏళ్లకు ఆసరా పెన్షన్లు ఇస్తుందో.. లేదో అని ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
Similar News
News November 6, 2024
KNR: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి.. UPDATE
KNR జిల్లా రామడుగు మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో <<14540335>>ఇద్దరు యువకులు<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. SI శేఖర్ వివరాల ప్రకారం.. రామడుగుకు చెందిన అరుణ్(20), శివాజీ(18) ఇంటర్ పూర్తి చేసి ఇంటివద్ద ఉంటున్నారు. అయితే నిన్న బైకుపై KNR వెళ్లి వస్తుండగా బొలెరో ఢీకొట్టడంతో శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. చెట్ట పొదల్లో పడిన అరుణ్‌ను స్థానికులు గుర్తించి ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.
News November 6, 2024
కరీంనగర్‌లో మార్కెట్ షెడ్లు పరిశీలించిన కలెక్టర్ పమేలా
KNR జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ పక్కన గతంలో చిరు వ్యాపారుల కోసం నిర్మించిన షెడ్లను కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుంచి వెళ్లే మార్గంలో ప్రస్తుతం చిరు వ్యాపారులు కూరగాయలు అమ్ముకుంటున్నారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్య నెలకొనడం, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కూరగాయల విక్రయాలకు ఇబ్బంది లేకుండా లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News November 6, 2024
BREAKING.. KNR: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్పాట్ డెడ్
KNR జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల ప్రకారం.. రామడుగు మండలం షానగర్ గ్రామ సమీపంలో బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. రామడుగు మండల కేంద్రం నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం షానగర్ శివారు ప్రాంతంలో కరీంనగర్ నుంచి బైకుపై వెళ్తున్న శివాజీ, అరుణ్‌ను ఢీ కొట్టింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.