News February 19, 2025

కరీంనగర్: ప్రభుత్వ ఎస్సీ హాస్టల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

image

కరీంనగర్ పట్టణం కాశ్మీర్ గడ్డలోని ప్రభుత్వ ఎస్సీ కళాశాల, గర్ల్స్ హాస్టల్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో వసతిపై ఆరా తీశారు. విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమయ్యే కెరియర్ ఆప్షన్స్ చాట్‌ను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. కాసేపు విద్యార్థులతో సరదాగా గడిపారు.

Similar News

News March 15, 2025

జమ్మికుంట: రైలుకింద పడి వ్యక్తి మృతి

image

జమ్మికుంట రైల్వేస్టేషన్లో వ్యక్తి మృతిచెందాడు. రైలు ఎక్కుతుండగా కొమురయ్య (50) జారిపడి చనిపోయాడు. మృతుడు రైల్వేలో గ్యాంగ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడు స్వస్థలం హనుమకొండ జిల్లా సోమిడి.

News March 15, 2025

జమ్మికుంట: రైల్వేపట్టాలపై యువతి, యువకుడి మృతదేహాలు

image

జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్- పాపయ్యపల్లి గ్రామాల మధ్య రైల్వే పట్టాల పక్కన యువతీ, యువకుడి మృతదేహాలు కలకలం రేపాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రేమజంటగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే పోలీసులు మృతదేహాల వద్ద పంచనామా నిర్వహించి, వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిసమాచారం తెలియాల్సి ఉంది.

News March 15, 2025

KNR: ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను వేధించే పాలన: KTR

image

కాంగ్రెస్ ప్రజాపాలనపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ X ద్వారా తీవ్ర విమర్శలు చేశారు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను వేధించే పాలన అని కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంపద సృష్టిస్తాం , ప్రజలకు పంచుతాం అని ప్రగల్భాలు పలికిన నాయకులు.. సగటున నెలకు రూ.10 వేల కోట్ల చొప్పున రూ.లక్ష 50 వేల కోట్లు అప్పు తెచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారికంగా ఒప్పుకుంది అని అన్నారు.

error: Content is protected !!