News March 29, 2025
కరీంనగర్: ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలిక మృతి

కరీంనగర్ నగర పాలక పరిధిలోని రేకుర్తి సింహాద్రి కాలనీలో ప్రమాదవశాత్తు చెరువులో పడి శ్రీనిధి అనే బాలిక మృతి చెందింది. పెంపుడు కుక్కను బయటికి తీసుకువెళ్లగా.. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూమ్కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 9, 2026
NGKL: సింగోటం జాతర ఏర్పాట్లపై మంత్రి జూపల్లి సమీక్ష

కొల్లాపూర్లోని సింగోటం జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కలెక్టర్ సంతోష్తో కలిసి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రికి పండితులు ఆశీర్వచనాలందించారు. జాతరలో ప్రత్యేక ఆకర్షణగా టూరిజంశాఖతో ఐమాక్స్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
News January 9, 2026
పాసుపుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలోని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను సత్వరమే పంపిణీ చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్డీవోలు, తహశీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. పంపిణీ ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకతతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
News January 9, 2026
తెనాలి: రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో జైలు శిక్ష

తెనాలి (M) నందివెలుగు వద్ద అక్రమంగా రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తూ పట్టుబడిన ఫిరంగిపురానికి చెందిన ఉయ్యాల తిరుపతయ్యకు 3 నెలలు జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పవన్ కుమార్ తీర్పు ఇచ్చారు. 2022లో అప్పటి రూరల్ SI CH వెంకటేశ్వర్లు నిర్వహించిన తనిఖీల్లో నిందితుడు 60 బస్తాల PDS బియ్యంతో పట్టుబడగా, శుక్రవారం కేసు విచారణకు వచ్చింది. APP సునీల్ కుమార్ ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు.


