News February 26, 2025
కరీంనగర్: ప్రయాగరాజ్ వెళ్లి వస్తూ చనిపోయాడు..!

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. వీణవంక మండల కేంద్రానికి చెందిన గౌడ సంఘం సభ్యుడు నల్లగోని వీరయ్య ఇటీవల యూపీలోని ప్రయాగరాజ్‌కు వెళ్లి కుంభమేళాలో పాల్గొని శివయ్యను దర్శించుకున్నాడు. తిరిగి వాహనంలో వస్తున్న క్రమంలో మంగళవారం అర్ధరాత్రి నిజామాబాద్ పట్టణంలోకి రాగానే అతడికి హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయాడు.
Similar News
News March 21, 2025
గుడిహత్నూర్‌లో క్లినిక్ సీజ్

గుడిహత్నూర్‌లోని ఓ క్లినిక్‌ను అధికారులు సీజ్ చేశారు. సూర్యవంశీ అనే RMP వైద్యుడు తన పరిధికి మించి ఓ గర్భం దాల్చిన బాలికకు అబార్షన్ పిల్స్ ఇచ్చారు. విషయం తెలుసుకున్న DMHO డా.నరేందర్ రాథోడ్ ఆదేశాల మేరకు అధికారులు సదరు క్లినిక్‌ను సీజ్ చేశారు. జిల్లాలో ప్రాక్టీస్ చేస్తున్న RMPలు కేవలం ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని, పరిధికి మించి వైద్యం అందిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 21, 2025
అల్లూరి జిల్లాలో 89మంది విద్యార్థులు గైర్హాజర్

అల్లూరి జిల్లాలో శుక్రవారం 71పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి ఇంగ్లిష్ ఎగ్జామ్ జరిగింది. వివిధ పాఠశాలలకు చెందిన మొత్తం 11547మంది విద్యార్థులకు 11458మంది హాజరయ్యారని, 89మంది ఆబ్సెంట్ అయ్యారని DEO. బ్రాహ్మజీరావు తెలిపారు. చింతపల్లిలో 4 సెంటర్స్‌ను ఆయన తనిఖీ చేశారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
News March 21, 2025
GWL: సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు:DAO

కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ ఉప పథకం కింద సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందిస్తున్నట్లు గద్వాల జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్ శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు చిన్న, సన్నకారు మహిళా రైతులు, ఎస్టీ మహిళా రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాకు రూ. 56.88 లక్షలు మంజూరు అయ్యాయని తెలిపారు. అవకాశాన్ని అర్హత గల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.